ASF: కాగజ్ నగర్‌లోని రేణుక ఎల్లమ్మ గుడిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు DSP వహిదొద్దిన్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు మానుపాటి నరేష్‌ను మణికొండ గ్రామంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి వద్ద నుంచి అమ్మవారి బొట్టు బిళ్ల, సుమారు 10 గ్రాముల బంగారు ఆభరణాలు,1,250 గ్రాముల రెండు వెండి కిరీటాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.