KRNL: జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులు అమరావతికి బయలుదేరారు. 2,590 మంది రేపు సీఎం చంద్రబాబు చేతులమీదుగా నియామక పత్రాలు తీసుకోనున్నారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి 134 బస్సులను కలెక్టర్ ఏ. సిరి, డీఈవో శామ్యూల్ పాల్ ప్రారంభించారు. నూతన ఉపాధ్యా యులు రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులకు బోధించాలని కలెక్టర్ సూచించారు.
NLG: ఈనెల 25న ఉదయం 9 గంటలకు నార్కట్ పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బుధవారం ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. గట్టుపైన శ్రీ స్వామివారి ఆలయ హుండీతో పాటు, గట్టు కింద అమ్మవారి ఆలయ హుండీలను లెక్కిస్తామన్నారు.
NDL: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో బుధవారం ఉదయం 10 గంటల సమయానికి 15.82 టీఎంసీల నీటి నిల్వ నమోదయింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు ప్రస్తుతం 866.34 అడుగుల కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 868.5 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి గడిచిన 24 గంటల్లో 5300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మిరాయ్’ ఆడుతున్న అన్ని సినిమా థియేటర్ల స్క్రీన్లను ‘OG’ సినిమాకు కేటాయించనున్నారు. రేపు ఒక్కరోజు ‘మిరాయ్’ థియేటర్లలో ‘OG’ని ప్రదర్శించనుండగా.. ఎల్లుండి నుంచి యథాతథంగా ‘మిరాయ్’ థియేటర్లలో ఆడనుంది.
అన్నమయ్య: చిన్నపాటి వర్షానికే పీలేరు బస్టాండు దుస్థితి ఘోరంగా మారింది. బస్టాండు లోపల ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులు కూర్చునే బల్లల వరకు నీరు చేరడంతో బస్సు ఎక్కాలంటే మోకాలి లోతు నీటిలో దిగాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు పోయే కాలువలు పూడిపోవడమే దీనికి కారణమని అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
W.G: గత కొన్నేళ్లుగా తణుకులో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కార దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం గోస్తనీ నది గట్టును బండ్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పనులు ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తణుకులో రాష్ట్రపతి రోడ్డు మాత్రమే ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది.
కృష్ణా: గ్రంథాలయాల సమస్యలపై అసెంబ్లీలో చర్చ శుభ పరిణామం అని ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం నాయకులు బీరం వెంకటరమణ అన్నారు. బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాదును సంఘ నాయకులు కలిసి సత్కరించారు. తమ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించి, ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
VKB: కుల్కచర్ల మండలంలో పండుగ పర్వదినాలలో గ్రామాలలో సమస్యలు రాకుండా చూడాలని MPDO రామకృష్ణ సూచించారు. పంచాయతీ కార్యదర్శులందరూ అందుబాటులో ఉండి తాగునీరు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వీధిలైట్లు ఏర్పాట్లు చేసి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని MPDO హెచ్చరించారు.
BHPL: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 24తో ఓటర్ జాబితా రివిజన్ పూర్తయింది. స్థానిక సంస్థల ఓటర్ జాబితా ప్రకటించగా, ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. రిజర్వేషన్ల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 248 GPలు, 109 MPTC 12 ZPTC స్థానాలు ఉన్నాయని బుధవారం అధికారులు తెలిపారు.
AP: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలనూ గుర్తించినట్లు చెప్పారు. త్వరలోనే ఉప్పాడ వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తమలపాకులు యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నోటి దుర్వాసనను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని, మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను నివారిస్తాయి. అలసటను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
PLD: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు ముద్దాయిలను నకిరేకల్లు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ. 25,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం జేమ్స్ పేట నుంచి పురిటిపాడు మీదుగా చింతలగుంట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఈ రహదారి మీద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని కాలేజీ విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు బుధవారం వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి, ఈ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
BDK: ములకలపల్లి మండలంలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబుతో కలిసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాతూరు గ్రామస్తులను ఎమ్మెల్యే జారే కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు సమస్య లేకుండా అన్నింటిని పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శనాలపై మండలి ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి దర్శనాల్లో ఎమ్మెల్సీలకు ప్రత్యేక అవకాశం కల్పించాలని తెలిపారు. MLCలు ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను ఫోన్ చేసినా దుర్గగుడి అధికారులు స్పందించడం లేదన్నారు. MLCలు, బంధువులకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, MLCలకు ప్రత్యేక సమయం కేటాయించినట్లు మంత్రులు తెలిపారు.