• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోదీ ప్రభుత్వం గద్దె దిగాలని సంతకాల సేకరణ

ATP: రాయదుర్గం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని నిరసిస్తూ సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. వినాయక కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో సంతకాలు చేపట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేపట్టారు. అక్కడినుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

September 24, 2025 / 05:22 PM IST

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడికి స్వాగతం

NLG: సూర్యాపేటలో జరుగు మాల మహానాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్యకు బుధవారం కట్టంగూర్‌లో నాయకులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. మండలంలో మాల మహానాడును బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు.

September 24, 2025 / 05:21 PM IST

పాతగుంటూరులో చోరీకి పాల్పడ్డ వ్యక్తులు అరెస్ట్

GNTR: పాతగుంటూరులో చోటుచేసుకున్న దొంగతనం ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు ఇంట్లోని బీరువా పగులగొట్టి రూ. 2.40 లక్షలు దొంగలించిన కేసులో CI వెంకట ప్రసాద్, SI అబ్దుల్ రెహమాన్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

September 24, 2025 / 05:21 PM IST

సంఘ భవనానికి రూ. 5 లక్షలు మంజూరు చేసిన కేంద్ర మంత్రి

SRCL: కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవనం నిర్మాణం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రూ. 5 లక్షలు మంజూరు చేశారు. బుధవారం ప్రొసీడింగ్ పత్రాన్ని కోనరావుపేట మండల BJP అధ్యక్షులు మిర్యాల కార్ బాలాజీ మున్నూరు కాపు సంఘం సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

September 24, 2025 / 05:20 PM IST

ALERT: మరో 6 రోజులే గడువు

2019 మార్చి 31కి ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరని కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. ఈ నంబర్ ప్లేట్లను ఈ నెల 30లోగా ఏర్పాటు చేసుకోవాలని.. లేదంటే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్లు నిలిపోతాయని వెల్లడించింది. అమ్మకాలు, కొనుగోళ్లు కూడా సాధ్యం కావని తెలిపింది. ఈ నెంబర్ ప్లేట్ కోసం bookmyhsrp.com‌లో దరఖాస్తు చేసుకొవాలి.

September 24, 2025 / 05:19 PM IST

గంజాయి వినియోగం సమాజానికి చేటు: జిల్లా కలెక్టర్

ASR: గంజాయి వినియోగం సమాజానికి చేటని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గంజాయి ఉత్పత్తి, వినియోగం నివారించడమే లక్ష్యమని స్పష్టం చేసారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ నిఘాతో పాటు ప్రతీ చెక్ పోస్ట్ దగ్గర గంజాయి రవాణా నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

September 24, 2025 / 05:18 PM IST

ప్లాట్లను కాగితాలకే పరిమితం చేసి.. పట్ణణాన్ని అభివృద్ధికి దూరం చేశారు

PLD: అక్రమ లే అవుట్లను కాగితాలకే పరిమితం చేసిన గత పాలకులు.. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల పనితీరుపై బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన పట్టణాభివృద్ధికి అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

September 24, 2025 / 05:18 PM IST

‘ఎలాంటి పక్షపాతం లేకుండా సమాజ సేవ చేయడం NSS ఉద్దేశం’

KMM: ఎలాంటి పక్షపాతం లేకుండా సమాజ సేవ చేయడమే NSS కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అంతోటి తిరుపతిరావు అన్నారు. బుధవారం బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నళిని అధ్యక్షతన 56వ NSS డే కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, మూఢనమ్మకాలపైన అవగాహన సదస్సులలో పాల్గొనడం ద్వారా సమాజ అభివృద్ధికి విద్యార్థులు దోహదపడతారన్నారు.

September 24, 2025 / 05:18 PM IST

‘ఆధార్ ప్రత్యేక నమోదు కేంద్రాలను వినియోగించుకోవాలి’

AKP: నక్కపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక నమోదు కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీవో సీతారామరాజు సూచించారు. బుధవారం నక్కపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించారు. ఆధార్ కార్డుల్లో తప్పులు పడిన పేర్లు, చిరునామాలు మార్పులు చేసుకునేందుకు వచ్చిన వారికి సరిచేసి వెంటనే పంపించాలన్నారు.

September 24, 2025 / 05:15 PM IST

నర్సాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు

MDK: నర్సాపూర్ మున్సిపాలిటీకి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది నిధులతో నరసాపూర్ మున్సిపాలిటీలో రోడ్లు మురుగు కాలువల నిర్మాణాలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు కాంగ్రెస్ ఇంఛార్జ్ రాజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

September 24, 2025 / 05:12 PM IST

‘రికార్డుల సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవు’

SKLM: రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సిబ్బందిపై చర్యలు తప్పవని ఉపాధి హామీ పథకం ఏపీవో శ్రీదేవి అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పనులకు సంబంధించిన రికార్డులను సిద్ధం చేయాలని వారికి ఆదేశించారు. గ్రామాల్లో పనులు కల్పించేందుకు అవకాశాలను గుర్తించాలని సూచించారు.

September 24, 2025 / 05:08 PM IST

‘మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

SKLM: మధ్యాహ్న భోజన పథకానికి మెనూ ఛార్జీలు పెంచాలని, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళంలో యూటీఎఫ్ భవనంలో సమీక్ష నిర్వహించారు. కార్మికులు సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

September 24, 2025 / 05:06 PM IST

రామసముద్రం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీఐ

అన్నమయ్య: రామసముద్రం పోలీస్ స్టేషన్‌ను మదనపల్లి రూరల్ సీఐ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. విజయదశమి సందర్భంగా మండలంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

September 24, 2025 / 05:05 PM IST

తణుకులో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

W.G: విద్యార్థులు సమాజ సేవలో పాల్గొని తద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మిసుందరిబాయ్‌ పేర్కొన్నారు. జాతీయ సేవాపథం (ఎస్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత, అక్షరాస్యత ఎన్ఎస్ఎస్ లక్ష్యమని అన్నారు.

September 24, 2025 / 05:05 PM IST

వ్యాపారవేత తల్లికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ ఖాన్ మాతృమూర్తి బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.

September 24, 2025 / 05:05 PM IST