WNP: పెబ్బేరు మండలంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, కూడళ్ల అభివృద్ధికి మున్సిపల్ నిధుల నుంచి రూ. 15 కోట్లు మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. జీవో నెంబర్ 254 ప్రకారం నిధులను విడుదలకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పెబ్బేరు మండలం రూపు రేఖలు మారిపోతున్నట్లు ఆయన తెలిపారు.
SRPT: తుంగతుర్తికి చెందిన బచ్చు తిరుమలరావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన మృతదేహానికి బుధవారం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, గుండగాని రాములు గౌడ్, తునికి సాయిలు, యాదగిరి, శ్రీను, రవికుమార్, వీరోజి తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
AP: వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులతో జగన్ సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
TPT: తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ పీజీసెట్-25 ద్వారా వర్సిటీలో సీటు పొందిన విద్యార్థినులకు మంగళవారం నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థినులు ఆన్‌లైన్ అలాట్‌మెంట్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి ప్రవేశం పొందుతున్నారు. సీట్ అలాట్‌మెంట్ కాపీ పొందిన విద్యార్థినులు ఈనెల 27లోపు ప్రవేశం పొందలన్నారు.
JGL: రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బ్యాంకు లింకేజీ ద్వారా ఋణ సౌకర్యం కల్పించి వారిచే నిర్వహించే శ్రీ సిద్ది వినాయక మహిళ సంఘం క్యాంటిన్‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మనోహర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, రాయికల్ పట్టణ, మండల నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
AP: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా సూపర్ హిట్ కావాలని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆకాంక్షించారు. పవన్ గత రెండు చిత్రాలు హిట్ కాకపోయినా ఈ సినిమా కోసం కసిగా పని చేశారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, Dy. CM అయిన తర్వాత ‘OG’ సినిమాకు రూ.1,000 టికెట్ పెట్టడం అధికార దుర్వినియోగమం కాదా అని ప్రశ్నించారు. రేపు ‘OG’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
MDK: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, VHPS మెదక్ కోఆర్డినేటర్ దండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 100% ఉచిత ప్రయాణం ఇచ్చి, వికలాంగులకు 50% రాయితీ మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం హామీ నిలబెట్టకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం తప్పదని హెచ్చరించారు.
NTR: కంచికచర్ల పాత శివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. ఈ రూపాన్ని దర్శించుకోవడానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో కొలుచుకోవడం ఆనవాయితీ అని మహిళలు తెలిపారు.
KMM: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బోడపట్ల సుదర్శన్, కొండం కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన జిల్లా మహాసభలో వారిని ఎన్నుకుని అభినందించారు. గీత కార్మికులకు ప్రభుత్వం రక్షణ కిట్లు మంజూరు చేయాలని, బెల్ట్ దుకాణాలను ఎత్తివేయాలని, ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం సహకారం అందించాలని తెలిపారు.
E.G: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులు సందర్భంగా 3వ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శించడం సంతోషంగా ఉందన్నారు.
BDK: ఆదివాసి గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక గర్భిణీలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్ గ్రామంలో జ్యోతి అనే గర్భిణీని మంచానికి కట్టి మోసుకొని వస్తున్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిల్లో పోలీసులు బుధవారం డ్రోన్లను ఎగురవేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా అనంతపురం టూటౌన్, ఫోర్త్ టౌన్, గుత్తి, కళ్యాణదుర్గం వంటి పోలీసు స్టేషన్ల పరిధిల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ రేపు విడుదలవుతుంది. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుక్ మై షోలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 2.74 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం మీద దాదాపు 6.30 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ‘OG’ మేనియా నడుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో అండర్-14, 17 బాల, బాలికల క్రీడా పోటీలు ఈ నెల 27న నల్గొండలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు, బుధవారం SGF జిల్లా సెక్రటరీ దగ్గుపాటి విమల తెలిపారు. DEO ఆదేశాల మేరకు ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు.
NLG: కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుచున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా మూడవరోజు బుధవారం అమ్మవారు ‘అన్నపూర్ణ దేవి’ గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం.