• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పొలాలు మునగకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలి

GNTR: అధిక వర్షాల కారణంగా తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం, కొలనుకొండ, గుండిమెడ, కుంచనపల్లి గ్రామాల్లోని రైతుల పంట పొలాలు నీట మునిగాయి. డ్రైనేజ్ కాలువలు పూడిపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు గురువారం ఆరోపించారు. వడ్డేశ్వరం నుంచి గుండిమెడ వైపు వెళ్లే రహదారిని సైతం గండికొట్టి నీటిని బయటకు పంపే పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు.

September 25, 2025 / 12:39 PM IST

అశ్వారావుపేటలో ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభం

BDK: అశ్వారావుపేట పట్టణంలో గురువారం ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. వారితో పాటు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కోదండ రామారావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగ కిషోర్, దమ్మపేట మండల అధ్యక్షుడు కాకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

September 25, 2025 / 12:38 PM IST

R&B గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

SRPT: హుజూర్‌నగర్‌లో R&B గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్‌తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో, త్వరగాతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించారు.

September 25, 2025 / 12:38 PM IST

‘దీన్ దయల్ ఉపాద్యాయ సేవలు గొప్పవి’

ADB: హైందవ సిద్ధాంతం కోసం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అందించిన సేవలు గొప్పవని ఉట్నూర్ బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. గురువారం దీన్ దయల్ 109వ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రమేష్, నాయకులు అడ్వకేట్ భానోత్ జగన్, సిపతి లింగాగౌడ్, నాగభూషణం, తదితరులు ఉన్నారు.

September 25, 2025 / 12:37 PM IST

హైకోర్టును ఆశ్రయించిన కడప మాజీ మేయర్

AP: కడప మాజీ మేయర్ సురేశ్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వేసిన అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎప్పుడూ కూర్చి కోసం పాకులాడలేదని అన్నారు. ఈ క్రమంలోనే కడప ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డిపై ఘూటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి 16 నెలలు అవుతున్నా ఒక్క రుపాయి తేలేదని ఆరోపించారు.

September 25, 2025 / 12:37 PM IST

బలమైన భక్తికి హనుమంతుడు ప్రసిద్ధి: ఎమ్మెల్సీ

RR: బలమైన భక్తి, గొప్ప వినయ పూర్వకమైన స్వభావానికి హనుమంతుడు ప్రసిద్ధి అని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. హనుమంతుడు రాముని పట్ల చూపిన అచంచలమైన భక్తిని ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు.

September 25, 2025 / 12:37 PM IST

శొంఠి పొడితో అనారోగ్య సమస్యలకు చెక్

శొంఠి పొడి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడేవారు రోజూ శొంఠి టీ తాగితే మంచిది. మహిళల నెలసరి నొప్పులకు చెక్ పెడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇమ్యూనిటినీ పెంచుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

September 25, 2025 / 12:36 PM IST

గజలక్ష్మీ అలంకరణలో అమ్మవారు దర్శనం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం గజలక్ష్మీ అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

September 25, 2025 / 12:32 PM IST

‘లోకశాంతికోసం 9రూపాలలో అమ్మవారిని పూజిస్తారు’

RR: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని షాద్‌నగర్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాత్యాయని దేవిరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లోక శాంతి కోసం తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా అమ్మవారిని పూజించి ఆరాధిస్తారన్నారు.

September 25, 2025 / 12:32 PM IST

స్వచ్చతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సత్యసాయి: హిందూపురంలోని మున్సిపల్‌ పార్కులో గురువారం స్వచ్చతాహీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్వాంప్రసాద్‌ పాల్గొని పరిసరాలు శుభ్రం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. హిందూపురం TNSF అధ్యక్షుడు యుగంధర్, తెలుగు యువత పాల్గొన్నారు.

September 25, 2025 / 12:31 PM IST

శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత దర్శనం

BHPL: జిల్లా మంజూరునగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం దుర్గామాత శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి, జ్యోతి గార్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

September 25, 2025 / 12:30 PM IST

‘ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలి’

SRCL: స్వస్థ నారి, సశక్త్ పరివార్ అభియాన్‌లో ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. స్వస్థ నారి, సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో గురువారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించగా, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు వివిధ పరీక్షలు వైద్యులు, సిబ్బంది చేస్తుండగా ఆరా తీశారు.

September 25, 2025 / 12:29 PM IST

ఆయన అంత్యోదయ సిద్ధాంతం అందరికీ స్ఫూర్తి

RR: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వెంకటేశ్వర కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయన జాతీయవాద ఆలోచనలు అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

September 25, 2025 / 12:26 PM IST

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి: మంత్రి

KMM: ఏదులాపురం మున్సిపాలిటీలో చేపట్టిన ‘గడపగడపకు మన కాంగ్రెస్ – మన పాలేరు, మన శీనన్న కార్యక్రమం పోస్టర్‌ను గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భూక్య సురేష్ నాయక్ పాల్గొన్నారు.

September 25, 2025 / 12:25 PM IST

కడియంలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీ

E.G: ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం గురువారం కడియంలో నిర్వహించారు. పరిసర పరిశుభ్రంగా ఉంచాలని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, అలాగే ప్లాస్టిక్ వస్తువులు నిషేధించాలని నినాదాలు చేశారు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వభావ్ స్వచ్చత, సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమానికి కొనసాగుతాయని ఇంచార్జ్ MPDO పివి సుబ్బారావు వివరించారు.

September 25, 2025 / 12:25 PM IST