RR: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని షాద్నగర్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాత్యాయని దేవిరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లోక శాంతి కోసం తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా అమ్మవారిని పూజించి ఆరాధిస్తారన్నారు.