RR: బలమైన భక్తి, గొప్ప వినయ పూర్వకమైన స్వభావానికి హనుమంతుడు ప్రసిద్ధి అని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. హనుమంతుడు రాముని పట్ల చూపిన అచంచలమైన భక్తిని ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు.