PLD: ఫోరమ్ ఫర్ ఆర్టీఐ (FRTI) ఆధ్వర్యంలో త్వరలో పత్రికలు, యూట్యూబ్ ఛానెల్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఆర్టీఐపై మరింత అవగాహన కల్పిస్తామని జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ప్రకటించారు. నరసరావుపేట మండలం ఇస్సాపాలెంలో సోమవారం జరిగిన పల్నాడు జిల్లా నూతన కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
KDP: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం పులివెందుల పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి 53 మంది లబ్ధిదారులకు రూ. 39.26 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఈ చెక్కుల పంపిణీ సీఎం చంద్రబాబు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని అన్నారు.
సత్యసాయి: గుంటూరు–తిరుపతి మధ్య నడిచే 17261, 17262 ఎక్స్ప్రెస్ రైళ్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు ధర్మవరం వరకు పొడిగించబడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు ధర్మవరం చేరుకోగా, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరుతుంది.
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ‘హెల్తీ మోడ్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు గురుగ్రామ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు జొమాటో ప్రకటించింది.
NLR: కావలి పట్టణంలోనిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సంచులు వద్దు-గుడ్డ సంచులు ముద్దు అనే నినాదంతో ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశామన్నారు. షాపింగ్‌కి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి గుడ్డ సంచిని తీసుకెళ్లాలన్నారు.
MLG: జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాలకు సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో ఈ గ్రామాలకు ఎన్నికలను నిర్వహించట్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య నడుస్తున్న కోర్టు కేసు కారణంగా ఈ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించట్లేదని తెలుస్తోంది.
KMR: బిబిపేట్ పీహెచ్ సీలో మానసిక వ్యాధిగ్రస్థులకు సోమవారం డా.రాంబాయి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ వైద్య తెలిపారు. నిద్రలేమి, ఫిట్స్, ఆల్కహాల్ సంబంధిత మానసిక వ్యాధిగ్రస్థులకు పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. అవసరం మేరకు వ్యాధిగ్రస్థులకు కౌన్సిలింగ్ అందించారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని తిరందాస్ టాకీస్ ఎదురుగా ఉన్న మూలమలుపు దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయన్నారు. రహదారిపై భారీగా గుంతలు ఏర్పడడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
ప్రకాశం: మార్కాపురం మండల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఇవాళ టీడీపీ మండల కమిటీ నాయకులు ఎంపీడీవో బాల చెన్నయ్యను కోరారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో బాల చెన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాకర్ల శ్రీనివాసులు, సొసైటీ ఛైర్మన్ గోలమారి నాసర్ రెడ్డి, మాకం అబ్రహం, మట్టం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: ధర్మవరంలోని ఎన్జీవో హోమ్‌లో నిర్వహించిన ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్‌లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామం నుంచి స్మశాన వాటిక వరకు రోడ్డు పనులకు మోక్షం లభించింది. ఎన్నో దశాబ్దాలుగా స్మశాన వాటికకు వెళ్లేందుకు గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన స్థానిక సర్పంచ్ గుండ ఆదిత్య నాయుడు స్మశాన వాటిక రోడ్డు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అర్జీ దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLG: చండూరు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు సోమవారం ఉదయం 4:45 గంటలకు బయలుదేరిన పల్లె వెలుగు బస్సులో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రూ.110 ఉండే ఛార్జీని బస్సులో రూ.130 వసూలు చేశారని వాపోయారు. పల్లె వెలుగు బస్సు అయినా టికెట్ మీద ఎక్స్‌ప్రెస్ అని ఉందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ATP: దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు సోమవారం గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి మూలమూర్తికి వివిధ రకాల పుష్పాలు వెండి, బంగారు ఆభరణాలతో సరస్వతి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి బింద సేవ పూజ కార్యక్రమం నిర్వహించారు.