KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అట్లూరి రమాదేవి దర్శించుకున్నారు. మహిళలు పెద్దఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
GDWL: గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎస్.డీ. రాజు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సంఘసేవ విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు. పరోపకారం మానవత్వానికి నిదర్శనమని విద్యార్థులకు సూచించారు.
KDP: మైదుకూరు పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు తెలుగు గంగ కాలనీలోని నూతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈ సాధారణ సమావేశానికి ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు హాజరుకావాలని కోరారు.
E.G: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు పాల్గొన్నారు. అనంతరం వారు జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ బలోపేతానికి చేసుకున్న కార్యక్రమాలను వివరించారు.
WNP: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తుచేసుకున్న వారి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆదర్శ్ సురభి అగ్రహం వ్యక్తం చేశారు. పీఎం ఆవాజ్ యోజన గ్రామీణ సర్వేపై MPDOలతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో L 1 కింద 39,643 కుటుంబాలు ఉండగా, వాటిలో 30% మాత్రమే పూర్తి చేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
KRNL: నందవరంలో పంట కోత ప్రయోగాలపై వ్యవసాయ అధికారి సరిత ఆధ్వర్యంలో బుధవారం శిక్షణా కార్యక్రమం చేపట్టారు. ఏఎస్‌వో శివరామకృష్ణ పంట కోత ప్రయోగాల ప్రాముఖ్యతను వివరించి, పంట నమోదు పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 17,865 ఎకరాలలో పంట నమోదు పూర్తి కాగా, మిగిలిన 19,123 ఎకరాలలో పంట నమోదును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
KDP: విద్యార్థులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలని పులివెందుల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీఎన్ డాక్టర్ రాచకుంట నాగరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ సేవా పథక దినోత్సవాన్ని కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. 1969 సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఈ పథకం యువజన కార్యక్రమమని, విద్యార్థులు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
కృష్ణా: విజయవాడలోని ఉత్సవ్ 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
KMM: YSR హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు హౌసింగ్ కార్పోరేషన్‌ను రద్దు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పేద ప్రజలకు భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇళ్లును ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. ధనార్జన కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయంలోనే కూలిపోయిందన్నారు.
SKLM: ఏపీ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌గా పి.శ్రీనివాసులు రెడ్డి ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ఆయనకు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
HNK: హన్మకొండలో ప్రసిద్ధిగాంచిన శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు బుధవారంతో మూడవ రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వేద పండితులు నాగిళ్ళ షణ్ముఖ అవధాని తెలిపారు. మూలమూర్తికి షోడశ కలశాలతో మహానారాయణ ఊపనిషత్తుతో అభిషేక కార్యక్రమం నిర్వహించి, చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు.
PPM: మాజీ సీఎం, వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని మాజీ పార్వతీపురం MLA అలజంగి జోగారావు పార్టీ విస్తృత సాయి సమావేశంలో తాడేపల్లి సమావేశంలో బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ MLA మాట్లాడుతూ.. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాటం చేయాలని జగన్ సూచించారు అని తెలిపారు. అలానే, పార్టీని బలోపేతం చేయాలనిల కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
KRNL: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తుగ్గలి పోలీసులు బుధవారం పెండెకల్లు రైల్వే స్టేషన్లో మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ పులిశేఖర్, ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో నాకాబంది చేపట్టారు. రైల్వే స్టేషన్లోని పార్సిల్ కార్యాలయంతో పాటు డెమో రైలులో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు.
MNCL: మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట అటవీ ప్రాంతంలో గాంధా రిఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉన్న మేడి చెరువుకు వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ కోరారు. చెరువు కట్ట తెగిపోవడంతో నీరు వృథాగా పోతోందని తెలిపారు. మైసమ్మ జాతరకు వచ్చే ఆదివాసీలు ఇబ్బందులు పడతారని.. వన్యప్రాణులకు కూడా ఈ చెరువు నీరు ఆధారమని పేర్కొన్నారు.
GNTR: తెనాలిలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీరు బురదగా వస్తే తమకు తెలియజేయాలని బుధవారం మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. నీటి రంగు, స్మెల్ మారినా, పైప్‌లైన్‌ల లీకేజీలు ఉన్నా కార్యాలయంలోని కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 18004256468కు సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాలకు వ్యాధులు ప్రబలుతున్నందున కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు.