MDK: ఏడుపాయల మహాశివరాత్రి జాతర హుండీ లెక్కింపును బుధవారం గోకుల్ ఫంక్షన్ హాల్లో చేపట్టారు. 29 రోజుల హుండీ ఆదాయం రూ.39,87,178తో పాటు ఒడిబియ్యం, తలనీలాలు, ప్రత్యేక దర్శన టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయ సేవాల ద్వారా మొత్తం దేవస్థానానికి రూ.87,56,265 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. 2025 కంటే 2026లో ఆదాయం రూ.26,06,031 ఎక్కువగా వచ్చిందన్నారు.