SGR: లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా అధికారులు దృష్టి సారించాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని అస్తబల్‌లో శుక్రవారం పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాదగిరి మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరిందని చెప్పారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
SRD: యువత మాదకద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా, డ్రగ్స్ నిర్మూలనకు ముందుకు రావాలని అమీన్పూర్ CI నరేష్ సూచించారు. గురువారం పటేల్ గూడలోని ఇష్ట కాలేజీలో SFI, మంజీరా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు పోలీసు శాఖకు ఉన్నాయని తెలిపారు.
సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం పోతుకుంట గ్రామంలో ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ బీజేపీ నేత హరీష్ బాబు పాల్గొని మహిళల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై వివరించారు. మహిళల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగవేణి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఐలమ్మ చిన్నతనం నుండి సామాజిక సేవలకు దృష్టి పెట్టారు. సామాన్య ప్రజల బాధలను తన బాధలుగా తీసుకుని, వారికి న్యాయం, అందించడంలో ముందంజ వహించారన్నారు.
AP: రాష్ట్రంలో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు కళాశాలల భవన నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. పొన్నూరు, చోడవరం, మైదుకూరు, గుంతకల్లు, బేతంచర్ల కాలేజీలకు భూములు కేటాయించినట్లు చెప్పారు. మచిలీపట్నం, అనపర్తి, కేఆర్ పురంలో త్వరలో కేటాయిస్తామని అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో నటి శ్రియా రెడ్డి గీత పాత్రలో మెప్పించారు. తాజాగా దర్శకుడు సుజీత్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. సుజీత్ చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ‘OG’ విజయమని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సుజీత్‌కు ధన్యవాదాలు చెప్పారు. గీత పాత్రను అద్భుతంగా రాశారని, ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ADB: పట్టణంలోని న్యూ హౌజింగ్ బోర్డ్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. కాలనీలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనలోనే...
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో రవి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో ఉన్న అవుట్ పేషెంట్ విభాగం, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందించే వైద్య సేవల ధరల వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలపై అధికారులు ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. రోజుకు సుమారు 30 వేల మందికి IVR కాల్స్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు 87 శాతం మంది భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై పోలీసుల పనితీరుపైనా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు.
NGKL: తెలకపల్లి మండలం గౌరరం గ్రామానికి చెందిన గేయ రచయిత, MLC గోరేటి వెంకన్నకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈనెల 30న హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ డాక్టరేట్ అందించనున్నారు. గోరేటి వెంకన్నకు అవార్డు రావడం వల్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జనసేన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిపింది. జ్వరం తీవ్రత తగ్గకపోవడం, దగ్గు ఎక్కువగా రావడంతో ఇబ్బందిపడుతున్నట్లు పేర్కొంది. వైద్యుల సూచన మేరకు ఈరోజు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.
GNTR: 11 విలీన గ్రామాలతో ఉన్న గుంటూరు నగరంలో అమృత్ 1, 2 పథకాల అమలును వేగవంతం చేయాలని శుక్రవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రిని కోరారు. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన ఈ పథకానికి ప్రస్తుత ప్రభుత్వం అంచనా నిధులను కూడా కేటాయించి పనులు పూర్తి చేస్తే, నగరంలో తాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
మారణాయుధాలు కలిగి ఉండటంతో కెనడాలో అరెస్టైన ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ గోసల్ 4 రోజుల్లోనే బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నానని, ఖలిస్థాన్ కోసం గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఉద్యమానికి మద్దతు ఇస్తానని ప్రకటించాడు. ఢిల్లీ ఖలిస్థాన్ అవుతుందని, తనను అరెస్ట్ చేయడానికి ఫారిన్ రావాలంటూ NSA అజిత్ దోవల్‌కు సవాల్ విసిరాడు.
TG: OG సినిమా టికెట్ ధరలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎవరి బెనిఫిట్ కోసం ఈ బెనిఫిట్ షో అంటూ ప్రశ్నించింది. ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు.. సర్కార్ ఎందుకు అనుమతి ఇచ్చిందో మెమోలో పేర్కొనలేదని తెలిపింది. ఏ అంశాల ఆధారంగా సినిమా టికెట్ ధర పెంచారని అడిగింది.
KMM: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి సీపీఐ టౌన్ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.