• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం

AP: వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పే సమాధానం వాకౌట్ చేయకుండా వైసీపీ సభ్యులు వినాలని అన్నారు. లడ్డూ అంశంపై చర్చకు వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రి సమాధానానికి 10 నిమిషాలు సమయం కేటాయించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. అయితే, పార్టీలకు నిర్దేశిత సమయం ఉంటుందని, ప్రభుత్వ సమాధానానికి సమయం నిబంధన వర్తించదని తెలిపారు.

March 4, 2026 / 01:45 PM IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

KMM: బోనకల్ మండలం రావినూతల–జానకిపురం మధ్య వైరా రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన ఎన్.రమేష్ తన కుటుంబంతో కలిసి కృష్ణా జిల్లా వేములనర్వలో వెళ్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయమైంది.గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 4, 2026 / 01:45 PM IST

జిల్లాలో 74 మంది విద్యార్థులు గైర్హాజర్

SRCL: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు మంది 3727 విద్యార్థులకు గాను 3653 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 74 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు.

March 4, 2026 / 01:45 PM IST

‘రైతు బంధు గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి’

MNCL: రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబంధు గురించి స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇంతవరకు రైతుబంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ సగకాలం పూర్తయిన రైతుబంధు డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. రైతులకు రైతుబంధు డబ్బులు చెల్లించాలని ఆయన కోరారు.

March 4, 2026 / 01:45 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారికి ఆర్థిక సహాయం

అన్నమయ్య: చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి గ్రామానికి చెందిన పెనగలూరు లక్ష్మీదేవి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 20,524/-విలువైన చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ ఛార్జ్ KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు అందజేశారు.

March 4, 2026 / 01:45 PM IST

రీజనల్ కో-ఆర్డినేటర్‌గా బూడి ముత్యాలనాయుడు

పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు YCP రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు YS.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

March 4, 2026 / 01:44 PM IST

T20 WC వ్యూయర్‌షిప్ రికార్డ్

T20 వరల్డ్ కప్ భారత్‌లో వ్యూయర్‌షిప్ రికార్డ్ సృష్టించినట్లు ICC ఛైర్మన్ జైషా ప్రకటించారు. భారత్‌లో ఇప్పటికే 500 మిలియన్లు దాటిందని, T20 WCను గతంలో ఎన్నడూ ఇంతమంది చూడలేదని పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి నాకౌట్ మ్యాచులు జరగనున్న నేపథ్యంలో మరిన్ని రికార్డ్‌లు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.

March 4, 2026 / 01:43 PM IST

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

NDL: శక్తి యాప్ ఉండటం వల్ల మహిళలు, బాలికలకు మెరుగైన రక్షణ లభిస్తుందని శక్తి టీం సభ్యులు తెలిపారు. గోస్పాడు(మం) దీబగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.

March 4, 2026 / 01:41 PM IST

హెడ్ కోచ్ హెసన్‌పై పాక్ ప్లేయర్ల ఫిర్యాదు

T20 WCలో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ప్లేయర్లకు PCB ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లేయర్లంతా హెడ్ కోచ్ మైక్ హెసన్‌పై బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కనీసం తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆరోపించినట్లు సమాచారం. కాగా కోచ్ నిర్ణయాలు తీసుకుంటూ కెప్టెన్ ఆఘాను డమ్మీ చేశారని ఇటీవల పాక్ జర్నలిస్టులు కూడా ఫైరయ్యారు.

March 4, 2026 / 01:37 PM IST

జోరుగా ఉడాకాలని జంక్షన్ వద్ద సుందరీకరణ పనులు

VSP: గాజువాక నియోజకవర్గంలోని సమతా నగర్ సమీపంలో 160 అడుగుల రోడ్డు పనులు జోరుగా చేపట్టారు. ఉడా కాలనీ జంక్షన్ వద్ద రూ.1.70 కోట్లతో ఫౌంటైన్ లైటింగ్, చుట్టూ ట్రాక్ వంటి పనులు చేపట్టారు. ప్రస్తుతం టైల్స్ పనులు జరుగుతున్నాయి. VMRDA నిధులతో ఈ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు.

March 4, 2026 / 01:37 PM IST

రైతుల సమస్యల పట్ల ఉద్యమించాలి: MP నగేశ్

ADB: భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతుల సమస్యల పట్ల ఉద్యమించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో MLA పాయల్ శంకర్‌తో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లాధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు తదితరులు ఉన్నారు.

March 4, 2026 / 01:36 PM IST

మధ్యాహ్నం భోజన పథకాన్ని తనిఖీ చేసిన MRO

NLR: బుచ్చి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంఈఓ దిలీప్ కుమార్, టీడీపీ నేత దొడ్ల కోదండయ్య పరిశీలించారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులతో మమేకమై వారితో కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు.

March 4, 2026 / 01:35 PM IST

ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: SI

KDP: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కడప ITI సర్కిల్లో బుధవారం తాలూకా SI మోహన్ కుమార్ గౌడ్ ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, యూనిఫాం తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.

March 4, 2026 / 01:35 PM IST

మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం

AP: మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ సమయంలో గందరగోళం నెలకొంది. భోలే బాబా డెయిరీకి ఆవులు లేవని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతుండగా అధికారపక్షం అడ్డుకుంది. ఛైర్మన్ వెల్‌లోకి ఇరుపార్టీల సభ్యులు దూసుకొచ్చారు. దీంతో అధికారపక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామని వైసీపీ పేర్కొంది.

March 4, 2026 / 01:34 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కుసుంబ లింగయ్య సతీమణి కుసుంబ భూధవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, కథలాపుర్ మండలం అధ్యక్షుడు కాయితి నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గసికంటి ప్రభాకర్ పాల్గొన్నారు.

March 4, 2026 / 01:32 PM IST