NDL: శక్తి యాప్ ఉండటం వల్ల మహిళలు, బాలికలకు మెరుగైన రక్షణ లభిస్తుందని శక్తి టీం సభ్యులు తెలిపారు. గోస్పాడు(మం) దీబగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించారు.