MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ ఓం శ్రీ సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు ఆదివారం డిమాండ్ చేశారు. కాలనీలో రహదారులు దారుణ స్థితిలో ఉండడంతో వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.