PPM: కురాసింగి గ్రామాన్ని ముస్తాబు కార్యక్రమంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. గ్రామ శుభ్రత, పరిసరాల సుందరీకరణతో మలేరియా కేసులు తగ్గి, గత ఐదు నెలలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల శ్రమదానం, అధికారుల సమన్వయాన్ని కలెక్టర్ అభినందించారు.