BDK: ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. నేడు అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యా, వైద్య సేవల అమలును పరిశీలించారు.