KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా కడప జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, తహసీల్దార్ గంగయ్యలు ఆమెకు స్వాగతం పలికారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.