నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’ ఆశించిన విజయం సాధించలేకపోయింది. సినిమా వాయిదా పడటం, భారీ బిజినెస్ లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. సుమారు రూ.103-రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నష్టాల్లో ముగిసినట్లు టాక్. దీంతో నిర్మాతలే చొరవ తీసుకుని, బయ్యర్లకు అండగా నిలుస్తూ 50% GSTతో కలిపి రీఫండ్ చేసినట్లు సమాచారం.