SDPT: కథలు రాయడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత వికాసం పెంపొందుతుందని చిన్నకోడూరు మండల ఏంఈఓ తిరుపతి పేర్కొన్నారు. అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బాల సాహిత్య కార్యశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనిగరం, మేడిపల్లి, చెర్ల అంకిరెడ్డిపల్లి, అనంతసాగర్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.