ADB: తాంసి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయనను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల కార్యాలయ సిబ్బంది, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.