VZM: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వైసీపీ యువజన విభాగాల గజపతినగరం నియోజకవర్గ అధ్యక్షులు కే పైడుపునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమాత్రం సరిపోదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.