RR: కొత్తపేట డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటికి తక్షణం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ఉప్పల్ (మండల్) ఎమ్మార్వో పూల్ సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్‌లో ప్రజా ప్రయోజనాల కోసం వాటిని సంరక్షించవచ్చని తెలిపారు.