నల్గొండ అసిస్టెంట్ కమిషనర్(ఎన్ఫోర్స్మెంట్) బీ. సంతోష్ ఆదేశాల మేరకు, ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఏ. కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దేవరకొండ మండలంలో భారీ దాడులు నిర్వహించారు. పడమటి పల్లి క్రాస్ రోడ్ సమీపంలో జరిపిన ఈ రూట్ వాచ్లో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక మరియు నాటు సారాను పట్టుకున్నారు.