RR: సీఎం రేవంత్ రెడ్డిపై షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. షాద్ నగర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మూసీ నదిని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని, వ్యక్తి గతంగా ఈ విషయంలో ఆయనకు మద్దతు పలుకుతున్నానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు వేరైనా తాను మాత్రం సీఎంను ఈ విషయంలో సమర్థిస్తున్నానన్నారు.