TG: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్లలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరణించిన వారిని పోలీసులు దావీద్, వంశీలుగా గుర్తించారు. బాధితులు అనంతగిరి మండలం మొగలాయికోటలో అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
GDWL: గద్వాల పట్టణంలోని 10వ వార్డు అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ ఆలియా బేగం బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె.. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
SDPT: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు నంగునూరు మండలం, ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామ రైతులు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఆయనకు వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
KMM: మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్‌ను సందర్శించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ రేవతిని ఆదేశించారు. సుందరీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
వెస్టిండీస్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన దినేష్ కార్తీక్.. సంజూకు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదన్నాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్‌లకు ఏమాత్రం తగ్గకుండా సంజూకు అభిమానులున్నారని పేర్కొన్నాడు. కెరీర్‌లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా.. అభిమానులు మాత్రం సంజూను గుండెల్లో పెట్టుకున్నారని కొనియాడాడు.
TG: కాంగ్రెస్ నేతల అవినీతి, బినామీలను త్వరలోనే బయటపెడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోకాపేటలో మైనింగ్‌లో జరిగిన ఒక అవినీతిని బయటపెట్టామని చెప్పారు. హెచ్ఎండీఏకు చెందిన 17 ఎకరాల భూమిని ఓ సంస్థకు వేలం లేకుండా అప్పగించారని విమర్శించారు.
TPT: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 25,199 మంది విద్యార్థులకు గాను 24,789 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 410 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.
PPM: ఇల్లు లేని నిరుపేద గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. ఈమేరకు గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌కీ గిరిజనులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు.
అన్నమయ్య: మదనపల్లి–కర్ణాటక సరిహద్దులో చీకిలబైలు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాష మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కోమాలో ఉన్నట్లు రాయల్పాడు ఎస్సై రామా తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం శ్రీనివాసపురం ఆసుపత్రికి తరలించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో బుధవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో కాలనీలో తిరుగుతూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజు నాయక్, గండ్రకోట కుమార్, కొట్టే రాజిరెడ్డి, నాగేశ్వరరావు, సుధాకర్, సాంబశివ, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సత్యసాయి: బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఖిద్మత్-ఎ-ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు షామీర్ ఆధ్వర్యంలో 60 మందికి రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకట లక్ష్మమ్మ చేతుల మీదుగా ఈ సామాగ్రిని విద్యార్థులకు అందించారు.
BHNG: బొమ్మలరామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండా వాసులతో కలిసి రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. బంజరా సోదర సోదరీమణులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు.
TG: సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన రావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను పదే పదే బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారన్నారు. తరచూ అధికారుల బదిలీల వల్ల పాలన కుంటుపడుతోందన్నారు. పరిస్థితులు అర్థం చేసుకునేలోపు అధికారులకు బదిలీ అవుతోందన్నారు.
HNK: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనంపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి రాయితీ ప్రకటించలేదని వాహనదారులకు సూచించారు.
AP: రాష్ట్ర అసెంబ్లీలో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. హోంమంత్రి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇకపై 30 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వాణిజ్య, నివాస భవనాలకు ఫైర్ ఎన్‌వోసీ తప్పనిసరి చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలను సీజ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.