• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రజల ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో ప్రతిబింబిద్దాం’

GNTR: రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బలంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. బుధవారం అసెంబ్లీలోని జనసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా అసెంబ్లీని ఉపయోగించుకోవాలన్నారు.

March 4, 2026 / 03:44 PM IST

మంత్రి ఫోటో టాటూ వేయించుకున్న అభిమాని

JGL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఉన్న అభిమానంతో పెగడపల్లికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తన చేతిపై మంత్రి ముఖచిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు. మంత్రిపై ఉన్న అభిమానం, మంత్రిగా లక్ష్మణ్ కుమార్ చేస్తున్న అభివృద్ధి పనులకు గుర్తుగా బుధవారం గోవాలో తన చేతిపై మంత్రి ముఖచిత్రాన్ని పచ్చబొట్టుగా వేసుకున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.

March 4, 2026 / 03:43 PM IST

‘UBS’.. DSP అవుట్.. తమన్ ఎంట్రీ!

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలకే పరిమితం కానున్నారని సమాచారం. మాస్ ఎలివేషన్లు, కీలక సన్నివేశాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మేకర్స్ తమన్‌ను రంగంలోకి దించుతున్నట్లు టాక్. మార్చి 26, 2026న విడుదల కానున్న ఈ చిత్రంపై ఈ మార్పుతో అంచనాలు మరింత పెరిగాయి.

March 4, 2026 / 03:43 PM IST

పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసిన శివప్రసాద్

BPT: భూ రికార్డుల్లో పారదర్శకత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అన్నారు. బుధవారం రేపల్లె మండలం ఉప్పూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించి, వారికి పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 03:42 PM IST

తప్పు ఒప్పుకుంటున్నా: అచ్చెన్నాయుడు

AP: మండలి ఛైర్మన్ మోషేన్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అని అన్నారు. అలాగే క్రిస్టియన్ కాదని ఒప్పుకుంటే క్షమాపణలు చెబుతానన్నారు. అయితే, మోషేన్ రాజు తాను హిందువునేనన్నారు. దీంతో ‘నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న. భేషజాలాలకు పోను.. మీరు క్రిస్టియన్ అనుకున్నా. కాదని మీరు చెప్పారు.. వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. తప్పు ఒప్పుకుంటున్నా’ అని అచ్చెన్న పేర్కొన్నారు.

March 4, 2026 / 03:42 PM IST

డీఐజీని కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు

కర్నూలు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, పార్టీ కార్యక్రమాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తామన్నారు.

March 4, 2026 / 03:41 PM IST

ప్రమాదం స్థలాన్ని పరిశీలించిన అధికారులు

CTR: శ్రీరంగారాజపురం మండలంలో అగ్ని ప్రమాదంలో చెరుకు తోట, గానుగ షెడ్, బెల్లం దగ్ధమైన ఘటనపై నేడు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతు నవీన్‌ను కలిసి ఘటన ఎలా జరిగిందో ఆరా తీశారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతుకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే వేసవికాలంలో అగ్ని ప్రమాదాల నివారణకై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 4, 2026 / 03:41 PM IST

అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్

కామారెడ్డిలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ, ప్రైవేట్ డ్రైవర్లకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. SP రాజేశ్ చంద్ర హాజరై మాట్లాడారు. ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

March 4, 2026 / 03:40 PM IST

‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

SRCL: వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్లు, ఓపీ రిజిస్టర్ పరిశీలించి.. సూచనలు చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు.

March 4, 2026 / 03:39 PM IST

వీధి కుక్కలు హాల్చల్

VKB: ధరూర్ మండల గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ప్రతి గల్లీలో స్వైరవిహారం చేస్తూ ద్విచక్రవాహనదారులు, కాలినడకన వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాయి. రాత్రి వేళల్లో అరుస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. కాగా, గతంలో వీధి కుక్కల దాడిలో చాలామంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో వీధి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

March 4, 2026 / 03:39 PM IST

వాటర్ వాల్ లీక్ .. వెంటనే స్పందించిన వార్డు కౌన్సిలర్

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని 13వ వార్డులో వాటర్ వాల్ పగిలి నీరు రోడ్డుపై వృథాను ప్రవహిస్తున్నడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ గురవయ్య స్పందించి అధికారులను రంగంలోకి దింపారు. వెంటనే మరమ్మతులు చేయించి లీకేజీని అరికట్టారు .నీటి వృథాను అరికట్టి సమస్యను వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్‌ను వార్డు ప్రజలు అభినందించారు.

March 4, 2026 / 03:39 PM IST

వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి అందజేత

BPT: అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓలేరు గ్రామానికి చెందిన బలిజేపల్లి రవీంద్ర బాబుకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అండగా నిలిచారు. బుధవారం రవీంద్ర బాబుకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 3.25 లక్షల LOC  పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ ఆర్థిక సాయాన్ని సరైన రీతిలో వినియోగించుకుని త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 4, 2026 / 03:39 PM IST

‘ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయి’

WNP: ఇంటర్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య బుధవారం తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తున్నట్లు ధృవీకరించారు.

March 4, 2026 / 03:39 PM IST

రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు కృషి

ELR: రహదారి ప్రమాదాల నివారణ ధ్యేయంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. బుధవారం ఏలూరు ఆశ్రమం హాస్పటల్ సమీపంలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. హెల్మెట్లు ధరించిన వారిపై జరిమానాలను విధించకుండా వారితో 55 హెల్మెట్లను కొనుగోలు చేయించారు. రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికంగా హెల్మెట్ లేకపోవడం ఒక కారణమని పోలీసులు అన్నారు.

March 4, 2026 / 03:37 PM IST

తమ పదవులకు న్యాయం చేయాలి : ఎంపీడీవో రమేష్

ADB: ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన తమ పదవులకు న్యాయం చేయాలని బోథ్ ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. ఇవాళ బోథ్ మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వారి యొక్క పాత్ర, విధులు, బాధ్యతలు గురించి వివరించారు.

March 4, 2026 / 03:36 PM IST