JGL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఉన్న అభిమానంతో పెగడపల్లికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తన చేతిపై మంత్రి ముఖచిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు. మంత్రిపై ఉన్న అభిమానం, మంత్రిగా లక్ష్మణ్ కుమార్ చేస్తున్న అభివృద్ధి పనులకు గుర్తుగా బుధవారం గోవాలో తన చేతిపై మంత్రి ముఖచిత్రాన్ని పచ్చబొట్టుగా వేసుకున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.