AP: మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ సమయంలో గందరగోళం నెలకొంది. భోలే బాబా డెయిరీకి ఆవులు లేవని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతుండగా అధికారపక్షం అడ్డుకుంది. ఛైర్మన్ వెల్‌లోకి ఇరుపార్టీల సభ్యులు దూసుకొచ్చారు. దీంతో అధికారపక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామని వైసీపీ పేర్కొంది.
SRCL: చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కుసుంబ లింగయ్య సతీమణి కుసుంబ భూధవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, కథలాపుర్ మండలం అధ్యక్షుడు కాయితి నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గసికంటి ప్రభాకర్ పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్ ఆధ్వర్యంలో RIMS వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు మందులను పంపిణి చేసి, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని జిల్లా రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మాజ్ అహ్మద్, సాగర్ రెడ్డి, హరి ప్రసాద్ ఉన్నారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల దాడి ఘటనలో 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ పై విడుదలై మంచిర్యాలకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సీపీఐ నాయకులు బుధవారం స్వాగతం పలికారు. CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి కుట్రలు ఫలించలేదన్నారు. త్వరలోనే మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామన్నారు.
NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం గణితం పేపర్–2, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డిఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 6227 మంది విద్యార్థులకు గాను 6053 మంది పరీక్ష రాశారని 174 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK111’ రాబోతుంది. ఈ మూవీ మార్చి 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం మంచు మనోజ్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’లో కలిసి నటించిన ఈ ఇద్దరూ, పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనుండటం హాట్ టాపిక్‌గా మారింది.
విశాఖలో జరుగుతున్న భూగర్భ విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీ శ్రీ భరత్ విద్యుత్ అధికారులకు సూచించారు. విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 11 మండలాల్లో విద్యుత్ సరఫరా పనితీరు, సోలార్ విద్యుత్ వినియోగం, భూగర్భ పనులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాన్స్-కో ఎస్ఈ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
నల్గొండకి చెందిన రిటైర్డ్ హోంగార్డు వెంకటేశ్వర్లు(60) గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. వెంకటేశ్వర్లు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పోలీస్ అధికారులు కుటుంబాన్ని పరామర్శించారు.
NZB: ధర్పల్లిలోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మ్యాథమెటిక్స్, బాటని, సివిక్స్ పరీక్షలకు బుధవారం 290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 287 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారన్నారు.
HYD: MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో నాల్గో రోజు వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. నిమ్స్ నుంచి డైరెక్టర్‌ను రిక్రూట్ చేయడంపై నాలుగు రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. MNJ నుంచే డైరెక్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్‌ను వెనక్కి తీసుకోకుంటే సహాయ నిరాకరణ చేస్తామని తెలిపారు. నిరసనకు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది.
NTR: నందిగామ నియోజకవర్గానికి ఆర్&బి శాఖ నుంచి రూ.240 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రకటనలో తెలిపారు. రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీని ద్వారా వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు మరింత పురోగతి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షకు 199 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,796 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,597 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేదన్నారు.
కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ కర్నూలు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజును మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, విద్యా నాణ్యత మెరుగుదలపై వారు చర్చించారు.
TPT: ఏపీ సచివాలయం నుంచి రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్, మ్యుటేషన్, రిసర్వే, పీపీబి పంపిణీ అంశాలపై సీసీఎల్‌ఏ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మితో కలిసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సహా అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.