• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నందవరం సమీపంలో చక్కర లారీ బోల్తా

KRNL: నందవరం (మం) ముగతి సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరులోని సైదాపూర్ చక్కర ఫ్యాక్టరీ నుంచి కడప(D) ప్రొద్దుటూరుకు చక్కెర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ శివకుమార్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్తో పాటు క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.

March 4, 2026 / 10:35 AM IST

చోరీకి వచ్చి దొంగ మృతి

AP: చోరీకి వచ్చి దొంగ మృతిచెందిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు చోరీకి వచ్చారు. వారిని కాలనీవాసులు వెంటాడటంతో పరిగెత్తుతూ ఓ దొంగ రైల్వే ట్రాక్‌పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడి మృతిచెందాడు. పరారైన మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

March 4, 2026 / 10:34 AM IST

IPL 2026 ఫైనల్ జరిగేది అక్కడే

RCB తమ హోం మ్యాచులను 5 చిన్నస్వామిలో, 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని ఆ ఫ్రాంచైజీ CEO రాజేశ్ మీనన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్, అలాగే టోర్నీ ఫైనల్‌కు చిన్నస్వామి ఆతిథ్యమిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంతోష్ మీనన్ తెలిపారు. దీంతో RCB ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాగా 2014, 2016 టోర్నీ ఫైనల్స్ చిన్నస్వామిలోనే జరిగాయి.

March 4, 2026 / 10:33 AM IST

కలెక్టర్‌ను కలిసిన MP , MLA

ప్రకాశం: ఒంగోలు MLA జనార్దన్, MP మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలెక్టరేట్‌లో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై వారు చర్చించారు. ఒంగోలులో నెలకొన్న సమస్యలను జనార్దన్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంట్ పరిధిలోని సమస్యలను మాగుంట వివరించారు. కలెక్టర్ పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని తెలిపారన్నారు.

March 4, 2026 / 10:31 AM IST

క్వింటా పత్తి రూ.7,430

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం లాగే ఈరోజు సైతం పత్తి ధర స్థిరంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,430 ధర పలకగా.. ఈరోజు ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, ఎల్లో రకం మిర్చికి రూ.21,000, టమాటా మిర్చికి రూ.38,500, 1048 రకం మిర్చికి రూ.19,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

March 4, 2026 / 10:30 AM IST

సర్పంచ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, గ్రామ కాంగ్రెస్ నేతలు, సామాజిక సేవాకర్త దశరథ, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 10:30 AM IST

రోడ్ల అభివృద్ధికి రూ. 24.24 కోట్లు

TPT: రోడ్ల అభివృద్ధిపై ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరులోని నియోజకవర్గాల పరిధిలో మొత్తం 136.19 కిలో మీటర్ల మేర రోడ్లు మరమ్మత్తులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ. 24.24 కోట్లు నిధులు మంజూరైంది.

March 4, 2026 / 10:29 AM IST

కొమురవెల్లి స్టేషన్ త్వరలోనే ప్రారంభం

SDPT: కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారవుతోంది. ఎంపీ రఘునందన్ రావు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్‌ను కలిసి, పనులు పూర్తయిన స్టేషను వెంటనే అందుబాటులోకి తేవాలని కోరారు. దసరాకే ప్రారంభం కావాల్సి ఉన్నా, ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఎంపీ చొరవతో కదలిక రావడంతో ఈ నెలలోనే స్టేషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

March 4, 2026 / 10:29 AM IST

రోడ్లపై పశువుల సంచారం .. వాహనదారుల తిప్పలు

SRPT: కోదాడ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై పశువులు యధేచ్ఛగా తిరుగుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు ఉదయం, రాత్రి వేళల్లో రహదారిపై పశువులు అడ్డదిడ్డంగా సంచరిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

March 4, 2026 / 10:28 AM IST

గల్ఫ్ ప్రవాస ఆంధ్రులకు మంత్రి భరోసా

AP: గల్ఫ్ ప్రవాస ఆంధ్రులకు మంత్రి వాసంశెట్టి భరోసా కల్పించారు. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో మంత్రి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. APNRTC హెల్ప్‌లైన్‌తో సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి సూచించారు.

March 4, 2026 / 10:25 AM IST

ఈ పుణ్య కార్యంలో మీరు భాగస్వామ్యం కావాలి

RR: చేవెళ్ల పరిధి మల్కాపూర్‌లోని శ్రీ భువనేశ్వరి సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చేదిద్దెందుకు దాతల సహకారం అవసరమని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణ మండపం, కోనేరు నిర్మాణం,హోమగుండం ఏర్పాటు, రాజగోపురం నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పుణ్యకార్యంలో దాతలు భాగస్వామ్యం కావాలని, తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

March 4, 2026 / 10:24 AM IST

ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యం: కలెక్టర్

PLD: జిల్లాలో ‘మన ఆరోగ్యం.. మన బాధ్యత’ పేరుతో పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్ల వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యకర సమాజమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. గత నెలలో శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ప్రతి నెల మొదటి గురువారం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 4, 2026 / 10:24 AM IST

సీసీ కెమెరాలతో భద్రత: ఎస్పీ

WNP: వేసవి కాలంలో పలువురు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తారు. ఇంటి యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎప్పుడూ ఇంటి పరిసరాలను చరవాణుల్లో ప్రత్యక్షంగా చూడొచ్చన్నారు. కాలనీల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సూచించారు. పోలీస్ కంట్రోల్ రూంకు అందిస్తే నేరుగా నిఘాను తాము చూసే అవకాశం ఉంటుందన్నారు.

March 4, 2026 / 10:23 AM IST

మృతి చెందిన కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

MLG: బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు ఏటూరు నాగారం చెందిన మృతి చెందిన కార్యకర్త జగదంపుల పూలమ్మ కుటుంబానికి కాళ్ల రామకృష్ణ ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించి, జిల్లా అధ్యక్షుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

March 4, 2026 / 10:23 AM IST

టీవీలోకి వచ్చేస్తోన్న ‘శంబాల’

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మూవీ మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టీవీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా.. మార్చి 8న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు.

March 4, 2026 / 10:22 AM IST