NLG: శాలిగౌరారం మండలంలోని గురుజాలలో గల శ్రీవిశాలాక్ష సమేత కాశీవిశ్వ నాథేశ్వరస్వామి ఆలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి రెండు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఇవ్వాళ గణపతిపూజ, పంచామృత అభిషేకం, పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, అంకురార్పణ, కంకణధారణ, కూశ్మాండభవధనం, గ్రామ దర్శనం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.
TG: BRS నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రెండో కేసులోనూ బెయిల్ లభించింది. చెన్నూరు కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేయడంతో, ఇవాళ ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ సందర్భంగా వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన క్యాతనపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి.
MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి రేంజ్లో ముందస్తు సమాచారం మేరకు అటవీ అధికారులు సోదాలు నిర్వహించి వన్యప్రాణిని చంపి వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేతనపల్లి శివారులో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణిని వేటాడినట్లు నిందితులు అంగీకరించారు. నెందుగూరి నారాయణ, గురుండ్ల వసంత్, నిక్కూరి బాపుపై కేసు నమోదు చేసినట్లు FRO హఫీజుద్దీన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. తుది గడువు ఏప్రిల్ 13తో ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష జూన్ 7న నిర్వహిస్తారు. ఏపీలోని తిరుపతితో పాటు తిరువనంతపురం, కోల్‌కతా, భోపాల్, పూణె, మొహాలి, బెర్హంపూర్‌లో ఐసర్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్(BS), బీటెక్‌తో పాటు BS-MS ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి.
VZM: ఉపాధ్యాయ APJAC జిల్లా వైస్ ఛైర్మన్‌గా రాజాం మండలం కంచరాం మండల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మజ్జి మదనమోహన్ ఎన్నికయ్యారు. మంగళవారం స్దానిక NGO హోమ్‌లో నిర్వహించిన APJAC జిల్లా కార్యవర్గ ఎన్నికలలో ఆయనను ఎన్నుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో మూడుసార్లు APTF అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడుగా కూడా ఎన్నికయ్యారు.
ASF: జిల్లాలో మార్చి తొలి వారంలోనే సగటు ఉష్ణోగ్రత 35°C చేరింది. ఏప్రిల్, మే, జూన్లో పరిస్థితి మరింత కష్టతరం కావచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని, గొడుగును ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
GNTR: తుళ్లూరు టిట్కో గృహాల్లో ఒడిశాకు చెందిన మనోజ్ (32) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమరావతి నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్న అతడు, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
JGL: శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC సిద్ధమైంది. భక్తులు రూ.151చెల్లించి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కల్యాణం అనంతరం ఈ పవిత్ర తలంబ్రాలను భక్తుల చిరునామాకు డెలివరీ చేస్తామని జగిత్యాల డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తెలిపారు.
NRML: నిర్మల్లోని బస్టాండ్ సమీపంలో 2024లో ఓ వ్యక్తి నుంచి బంగారు గొలుసు, మొబైల్ దోచుకున్న నిందితులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ మేరకు తీర్పునిచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీ వినోద్ రావు, పోలీసు అధికారులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.
ATP: పీఏబీఆర్ డ్యాం నుంచి నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ జల్లిపల్లి వద్ద లీకేజీ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ లీకేజీ మరమ్మతు పనుల దృష్ట్యా బుధవారం సాయంత్రం వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ప్రధాన పైపు లైన్ మరమ్మతు పనులను పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
AP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈనెల 8న జరిగే బహిరంగ సభ వేదికగా సీఎం చంద్రబాబు వీటిని వెల్లడించనున్నారు. మహిళల సంరక్షణ కోసం కొత్తగా మరో 10 వన్‌స్టాప్ సెంటర్లను 8న ప్రారంభించనున్నారు. తణుకు, రంపచోడవరం, తుళ్లూరు, మార్కాపురం, ఆదోని, టెక్కలి, మాచర్ల, మదనపల్లె, కుప్పం, తిరువూరులో ఏర్పాటు చేయనున్నారు.
భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఖతార్ LNG ఎగుమతులను 40% వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. ఖతార్ నుంచి ఎగుమతి అవుతున్న నాచురల్ గ్యాస్ వినియోగదారుల్లో భారత్ అతిపెద్దది. భారతదేశం ఏటా సుమారు 27 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది.
WNP: సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో దర్శనమిస్తారు. విజయనగర శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయం, సంస్థానాధీశుల భక్తికి నిదర్శనం.
BHNG: శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కిందపడి గీత కార్మికుడు భూపతి వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగాయి. తోటి కార్మికులు ఆయనను 108లో నకిరేకల్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
KRNL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నేటి నుంచి 6 వరకు విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించాలని DEO సుధాకర్ ఆదేశించారు. 4న పాఠశాల స్థాయి, 5న మండల స్థాయి, 6న జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు పోస్టర్ ప్రదర్శన, క్విజ్, శాస్త్రవేత్తల వేషధారణ, సెమినార్లు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహ పెంచాలన్నారు.