• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నస్రుల్లాబాద్‌లో కోతుల స్వైరవిహారం

KMR: నస్రుల్లాబాద్‌తో పాటు సంగెం, మైలారం, నాచుపల్లి గ్రామాల్లో కోతులు ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోతుల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

March 3, 2026 / 05:23 PM IST

రూ.39 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం, తుర్కపల్లి డివిజన్ పరిధి వెంకన్న కాలనీలో మంగళవారం సుమారు రూ.39 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్కును పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 05:23 PM IST

రేపే శ్రీరంగనాథ స్వామి రథోత్సవం

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ తేదీన స్వామి వారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవ వేడుకలు చూసేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిపారు.

March 3, 2026 / 05:23 PM IST

‘డ్రైనేజీలలో చెత్త వేయొద్దు’

SKLM: టెక్కలిలోని ఎన్టీఆర్ నగర్‌లో మండల బీజేపీ అధ్యక్షులు జర్జాన రాంజీ మంగళవారం పర్యటించారు. ఈ మేరకు కాలనీలోని పలు వీధులను పరిశీలించి, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, చెత్త బుట్ ల్లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డయేరియా వ్యాధి ప్రబలతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 3, 2026 / 05:22 PM IST

హోంగార్డుల ట్రాన్స్ఫర్‌పై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన హోంగార్డుల ట్రాన్స్ఫర్‌పై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కరీంనగర్ సీపీ 337 మంది హోంగార్డుల వద్ద డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారని, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం విధితమే. 186 మంది హోంగార్డుల వద్ద ఒక్కో హోంగార్డు నుంచి రూ.1 లక్ష చొప్పున రూ.1.86 కోట్లు వసూలు చేశారన్నారు.

March 3, 2026 / 05:21 PM IST

సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభం

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని జ్యోతి నగర్‌లో అభివృద్ధి పనులకు కౌన్సిలర్ పుల్లూరి తిరుమల కళ్యాణ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సహకారంతో రూ.4 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 3, 2026 / 05:21 PM IST

కమాన్పూర్ మండలంలో ఘనంగా హోలీ వేడుకలు

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని సుభాశ్నగర్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సుభాష్ నగర్ జూనియర్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీవాసులు, చిన్నారులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. యువత డీజే పాటల హోరులో నృత్యాలు చేస్తూ, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

March 3, 2026 / 05:21 PM IST

32 ఎకరాల భూదాన్ భూములు కబ్జా: వాసుదేవ్

ఖమ్మం భూదాన్ భూములను మంత్రులు కబ్జా చేశారని తెలంగాణ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్ ధ్వజమెత్తారు. 1989 వరకు 62.07 ఎకరాలు భూదాన్ పేరుతో ఉండగా, విలువ పెరగడంతో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వందల ఎకరాలు కలిగి ఉండగా, మిగిలిన 32 ఎకరాలను కబ్జా చేశారని విమర్శించారు.

March 3, 2026 / 05:20 PM IST

కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరసన

VZM: విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ డీఏలు, సర్వీస్ సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

March 3, 2026 / 05:20 PM IST

వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం

SDPT: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్య ప్రాణుల రక్షణ, పర్యావరణ సమతౌల్యంపై అధికారులు అవగాహన కల్పించి, హర్బల్ గార్డెన్లో ఔషధ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో FRO దివ్య, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరామ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 05:20 PM IST

అనంతపురంలో మట్టి కుండలకు పెరిగిన డిమాండ్

ATP: వేసవి తీవ్రత దృష్ట్యా అనంతపురంలో మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. పరిమాణం, డిజైన్‌ను బట్టి ఒక్కో కుండ 30 నుంచి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గొంతు సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు సహజ సిద్ధమైన చల్లదనం కోసం ఫ్రిజ్‌ల నుంచి మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు.

March 3, 2026 / 05:20 PM IST

‘ఆయా షేర్’తో నాని మరో రికార్డు!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఆయా షేర్’ సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో 1 మిలియన్ లైక్స్ సాధించి, నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్‌గా నిలిచింది. అంతేకాదు దాదాపు 158 గంటల పాటు ట్రెండింగ్‌లో కొనసాగి పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ క్రేజ్‌ను ఇది మరోసారి చాటిచెప...

March 3, 2026 / 05:20 PM IST

పాచిపెంటలో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి

PPM: హౌస్ టాక్స్ వసూళ్లు వేగవంతం చెయ్యాలని జిల్లా పంచాయతీ అధికారి రమేష్ రామన్ తెలిపారు. ఇంటి పన్ను చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సర్వేలు పురోగతిపై ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బందిని గైడ్ చేస్తూ సర్వేలు పూర్తి చేయించాలన్నారు.

March 3, 2026 / 05:18 PM IST

ఇంచర్ల రైతుల ఆవేదన..!

MLG: జిల్లా ఇంచర్ల రెవెన్యూ పరిధిలో గట్టమ్మ వద్ద 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్లు 28, 29లోని 12 ఎకరాల భూమిపై 10 మంది రైతులు ఇవాళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ కంపెనీ నిర్మాణ ప్రకటనతో భూమి కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 20 గుంటల భూమి, ఉద్యోగ అవకాశాలు అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

March 3, 2026 / 05:16 PM IST

ప్రవసాంధ్రలతో మాట్లాడిన ఎంపీ

VZM: ఇరాన్ – ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం జరగడంతో గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులతో విజయనగరం MP అప్పలనాయుడు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విజయనగరంలోని తన కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాల్ మాట్లాడిన ఎంపీ కేంద్రం సొంత గ్రామాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యుద్ధంతో మందులు, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

March 3, 2026 / 05:15 PM IST