AKP: ఎస్.రాయవరం మండలం దార్లపూడి, చినగుమ్ములూరు, పెదగుమ్ములూరు, తిమ్మాపురం, వాకపాడు, గుడివాడ, ఎస్.రాయవరం పంచాయతీలలో ఇంటి పన్నుల వసూలు కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మంగళవారం పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధికి ఈ పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు.
KMM: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆయన.. ఈ నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నేతలు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
తమిళ హీరో విజయ్, త్రిషల రిలేషన్‌పై వస్తున్న వార్తలపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి మధ్య సంబంధం ఉండొచ్చని, కానీ త్రిష విజయ్‌ని ప్రేమించడం లేదని పేర్కొంది. త్రిష ఉదయనిధి స్టాలిన్‌ను ప్రేమిస్తోందని, గతంలో త్రిష నిశ్చితార్థం రద్దు కావడానికి కూడా ఆయనే కారణమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.
ప.గో.జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మహిళా సాధికారత అంటే కేవలం చట్టాలపై అవగాహన మాత్రమే కాదని వారి శారీరక ఆరోగ్యం, క్షేమం కూడా ప్రధానమన్నారు.
KMR: లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక బడిన కులాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో తాటి చెట్టుపై నుంచి కింద పడి అంగవైకల్యం పొందిన గీత కార్మికుడు సంజీవ్ గౌడ్‌కు ఎక్సైజ్ శాఖ నుంచి రూ.5 లక్షల ఎక్సగ్రేషియా అందించినట్లు వారు తెలిపారు.
ADB: నార్నూర్ మండలమంతా ఈ రోజు హోలీ పండుగను రంగుల హర్షధ్వానాలతో ఘనంగా జరుపుకున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. గ్రామ వీధులు గులాబీ, పసుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడాయి. యువత డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
NRML: సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రత ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ భోజన్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు 100 శాతం పాల్గొని తమ పాఠశాలను నమోదు చేయాలని వారు సూచించారు. క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖనం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలని, మార్చి 14 చివరి తేదీ అని పేర్కొన్నారు.
MDCL: హోలీ పండుగ సందర్భంగా మేడిపల్లిలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపారు. కొందరు స్ప్రేలతో రంగులు నింపి స్నేహితులపై చల్లుకుంటూ సంతోషం పొందుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాలతో చిందులు వేసారు.
AP: కడప జిల్లా మైదకూరు నియోజకవర్గంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. సమస్యలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. విద్యార్థులు, మహిళలు బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. దారి కావాలని వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
SRD: సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలో నడవాలని దక్షిణ కాశీ సేవాలాల్ ఘడ్ పీఠాధిపతి సంత్ శ్రీ జగదీశ్వర్ నందు మహారాజ్ అన్నారు. మంగళవారం ఖేడ్ మండలం శివార్ సందూర్ తండాలో హోలీ జాతర మహోత్సవంలో 21 మంది కన్నెలతో అభిషేకం, హోమం పూజలు నిర్వహించారు. స్థానిక యంత్ర తంత్ర త్రిశూలాన్ని దర్శించుకోవడంతో పాపాలు తొలిగి పోతాయని పేర్కొన్నారు.
MBNR: రాష్ట్ర వ్యాప్తంగా సంచలమైన సృష్టించిన ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
KDP: సీ.కే దిన్నెలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎస్సై శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేసి విజయాన్ని సాధించాలని ప్రేరేపించారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పరిసర ప్రాంత గ్రామాలలో మంగళవారం హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో చిన్న, పెద్ద అందరు పాల్గొని రంగులు పూసుకుని హోలీ వేడుకలను జరుపుకున్నారు. కొంతమంది చిన్నారులు గోగు పువ్వుతో తయారుచేసిన రంగులు చల్లుకొని హోలీని జరుపుకున్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కోరారు.