• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

TG: అన్ని జిల్లాల కలెక్టర్లతో CM రేవంత్ సమావేశమయ్యారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌ అమలు చేయబోతోంది. ఈ నేపథ్యంలో పరిపాలనలో కలెక్టర్లకు CM కీలక దిశానిర్దేశం చేస్తున్నారు.

March 3, 2026 / 04:57 PM IST

దుర్వినియోగ నిధులు పంచాయతీ ఖాతాకు జమ

AKP: గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీలో నిధుల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తీసుకుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పేరుతో దుర్వినియోగం చేసిన రూ.1,51,181ను పరారీలో ఉన్న సర్పంచ్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు పంచాయతీ ఖాతాకు జమ చేశారు. నగదు రసీదును ఎంపీడీవోకు అందజేశారు. ఈ ఘటనపై తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

March 3, 2026 / 04:57 PM IST

రేపు అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్

SRPT: ప్రభుత్వం 100 రోజుల ప్రజా పాలనలో భాగంగా రేపు అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అనంతగిరి మండల ప్రజలు ఈ హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంప్‌లో కంటి, దంత, షుగర్, బీపీ, జనరల్ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

March 3, 2026 / 04:55 PM IST

‘ఎండాకాలంలో మంచినీటి సమస్య రాకుండా చూడాలి’

WNP: రాబోయే ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ మాధవి తెలిపారు. మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం తన చాంబర్ నుండి మాట్లాడుతూ.. పైపు లీకేజీలు ఉన్న వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులపై అందరూ కలిసి పనులు చేసుకోవాలని ఆమె సూచించారు.

March 3, 2026 / 04:53 PM IST

T20 WC: పరుగుల్లో పాక్.. వికెట్లలో USA టాప్

2026 టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాకిస్తాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ (383 పరుగులు) ఉన్నాడు. భారత్ నుంచి సూర్యకుమార్ 231 పరుగులతో 5వ స్థానంలో నిలిచాడు. అలాగే, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అమెరికాకు చెందిన షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (13 వికెట్లు) కొనసాగుతున్నాడు. వరుణ్ చక్రవర్తి 12 వికెట్లతో 4వ స్థానంలో నిలిచాడు.

March 3, 2026 / 04:53 PM IST

చిత్తూరులో “వార్తలాప్” అవగాహన సదస్సు

CTR: చిత్తూరులో నిర్వహించిన “వార్తలాప్” అవగాహన సదస్సులో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పథకాలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

March 3, 2026 / 04:52 PM IST

కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

AP: చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. 14 సైనేడ్ బాంబులు పెట్టినట్లు కోర్టు ఏవోకు మెయిల్ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

March 3, 2026 / 04:52 PM IST

బీబీపేటలో ఆదివారం నుంచి పశువుల సంత

KMR: బీబీపేట మండల కేంద్రంలో ఈ నెల 8వ తేదీ (ఆదివారం) నుంచి పశువుల సంత ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వెనుక భాగంలో ఈ సంతను ఏర్పాటు చేశారు. ఇందులో ఎడ్లు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలు, విక్రయాలు జరుగుతాయని పంచాయతీ వర్గాలు తెలిపాయి. బీబీపేటతో పాటు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 3, 2026 / 04:52 PM IST

కాంగ్రెస్‌లోకి మావోయిస్టులు..?

TG: లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్‌ను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని.. పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోదీ.. మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదన్నారు. కానీ ప్రజల కోసం పోరాడిన వాళ్లపై తమకు గౌరవం ఉంటుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్నారు.

March 3, 2026 / 04:48 PM IST

నాసిరకం మెటీరియల్‌తో నూతన GP భవన నిర్మాణం

NLG: మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం శాఖ కార్యదర్శి, 7వ వార్డు సభ్యులు బంటు నాగరాజు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారని, దీనిపై పంచాయతీ ఏఈని అడగగా తమకు సమాచారం లేదని తెలిపారని అన్నారు.

March 3, 2026 / 04:47 PM IST

అశ్లీల కంటెంట్‌పై నిషేధం విధించిన మస్క్

భారతదేశంలో ఎక్స్ వేదికపై అశ్లీల కంటెంట్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల చాలామంది వినియోగదారులు ఆ కంటెంట్‌ను చూడలేకపోతున్నారు. ఇది మస్క్ నిర్ణయమా, ప్రభుత్వ నిబంధనలా అనే చర్చ మొదలైంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. దేశ డిజిటల్ చట్టాల నేపథ్యంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.

March 3, 2026 / 04:46 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: మంత్రి

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆయన రామచంద్రాపురంలో జరిగిన నియోజకవర్గస్థాయి కూటమి నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలలో అధిక శాతం స్థానాలలో కూటమి పార్టీల అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

March 3, 2026 / 04:44 PM IST

బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

WNP: పెద్దమందడి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

March 3, 2026 / 04:43 PM IST

కాలువ పూడికతీత.. రైతులకు ఊరట

KNR: దుద్దెనపల్లి కేతిరి మల్లారెడ్డి బ్రిడ్జి నుంచి ఎక్లాస్పూర్ వెళ్లే కాలువలో తుంగ, చెట్లు పెరిగి సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులకు తెరపడింది. ఈ సమస్యపై సర్పంచ్ విజయ స్పందించి జేసీబీతో కాలువను శుభ్రం చేయించారు. దీంతో సాగునీటి కష్టాలు తీరాయని దుద్దెనపల్లి, ఎక్లాస్పూర్ రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 04:43 PM IST

బీసీ వసతి గృహంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అవేర్నెస్ ప్రోగ్రాం

WNP: అటవీ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా నాగవరం ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అడవుల సంరక్షణ ద్వారా వన్యప్రాణులను ఎలా కాపాడుకోవచ్చో అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి, సంక్షేమ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.

March 3, 2026 / 04:42 PM IST