TG: కాజీపేట రైల్వేట్రాక్ మెయింటెనెన్స్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నలుగురిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
NZB: తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది యెండల ప్రదీప్‌ను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, మంతెన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాటాలు, సకల జనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.
HNK: ఓరుగల్లు అరణ్య ప్రాంతాలు, సరస్సు తీరాలు పక్షులకు నిలయాలుగా మారాయి. ఫిబ్రవరిలో విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చి విహరిస్తుంటాయి. కొన్ని సంతాన ఉత్పత్తి చేసుకొని వేసవి ప్రారంభం కాగానే తిరిగి తమ దేశాలకు పయనిస్తుంటాయి. పలు జాతులు తమకు హాని లేదని గ్రహించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 350 జాతుల పక్షులు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
NDL: బనగానపల్లె ఎమ్మెల్యే రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలిసి ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రోడ్ల నిర్మాణాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని మంత్రి బీసీ అన్నారు.
MBNR: ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల నిరాపరాదుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో మద్యం సేవించి ఆటోలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 5 మంది డ్రైవర్లకు కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించిందన్నారు. మద్యం మత్తులో ఆటోలు నడపడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మందస మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యవ్వారి నారాయణరావు 28 సంవత్సరాలు ఆర్మీలో సేవలు అందిస్తూ… నేడు లెఫ్టినెంట్ హోదాలో పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుదీర్ఘకాలం ఆర్మీలో పనిచేస్తూ దేశ సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
BDK: భద్రాద్రి జిల్లా యంత్రాంగం క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు సేవలు అందించడం సంతోషకరమని కలెక్టర్ జితేష్ వీ పటేల్ తెలిపారు. ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను ఇల్లందు ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. NPDCL విభాగానికి బదిలీ అయిన ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
BDK: దమ్మపేట మండలం అటవీశాఖ అధికారి రేంజర్ కమల కు మంగళవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, మునకనపల్లి గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములలో అటవీ అధికారులు సమాచారం ఇవ్వకుండా జెసిబి లతో కందకాలు తవ్వడం సరికాదని మండిపడ్డారు.
JGL: జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువకులు, మహిళలు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి యువతతో కలిసి రంగులు పూసుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: హిందూపురంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. నిందితులందరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
AP: గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో మంత్రి సుభాష్ వీడియో కాల్ మాట్లాడారు. ఏపీ ఎన్ఆర్టీసీ హెల్ప్‌లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వెంటే ఉంటుందని కార్మికులకు ధైర్యం చెప్పారు.
CTR: చిత్తూరులోని అపోలో యునివర్సిటీలో మంగళవారం నిర్వహించిన “వికసిత్ భారత్” కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువశక్తిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే వికసిత్ భారత్ లక్ష్యమని తెలిపారు.
KMM: తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్‌లో గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం నర్సరీలో సర్పంచ్ కొవ్వూరు పద్మ, ఉప సర్పంచ్ బాలకృష్ణ కలిసి స్వయంగా మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు నర్సరీలో టేకు, వేప, రావి, మర్రి వంటి అటవీ జాతి మొక్కలతో పాటు మామిడి, జామ, ఉసిరి మొక్కలను ఉన్నాయని తెలిపారు.
TG: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
NGKL: అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తుల కోసం కల్వకుర్తి డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుహాసిని తెలిపారు. ఈనెల 31న సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, వచ్చే నెల 3న తిరిగి చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,000గా నిర్ణయించారు. బుకింగ్ కోసం 90590 23739 నంబరును సంప్రదించగలరు.