• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపటి నుంచి జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు: డీఎంహెచ్‌వో

SRPT: జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకట రమణ తెలిపారు. PHCల్లో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, కంటి, పంటి నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య సూర్యాపేట’ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

March 3, 2026 / 04:20 PM IST

ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన ఎంపీడీవో

VZM: బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ మంగళవారం మండలంలోని దెబ్బగుడ్డివలసలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి, ఇప్పటి వరకు జరిగిన వసూళ్లపై సంతృప్పి వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువులోగా వంద శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

March 3, 2026 / 04:19 PM IST

బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం

AKP: మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా టౌన్ పోలీసులు శివపురం ఎస్టీ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టౌన్ సీఐ షేక్ గపూర్ డయల్ 112, షీ టీమ్స్, శక్తి యాప్, మహిళల రక్షణ చట్టాలపై వివరించారు. వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

March 3, 2026 / 04:19 PM IST

‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టులో మరో పిటిషన్

‘ది కేరళ స్టోరీ’ చిత్ర టైటిల్‌ను మార్చాలంటూ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. కేరళ పేరు వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఒక రిటైర్డ్ టీచర్, మహిళా లాయర్ ఈ పిటిషన్ వేశారు. ఇది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రచారమని పేర్కొన్నారు. సినిమా విడుదల తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

March 3, 2026 / 04:19 PM IST

ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు

SRCL: హోలీ పండుగ ను పురస్కరించుకొని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనవాయితీ ప్రకారం నజరానా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 04:19 PM IST

‘పైపుల మార్పుకు ప్రజల సహకారం అవసరం’

KRNL: నగరంలో డ్రైనేజీ కాలువల్లో తాగునీటి పైపుల మార్పుకు ప్రజల సహకారం అవసరమని కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఇవాళ ఇంజనీరింగ్, అమినిటీస్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, డ్రైనేజీ కాలువల్లో కలుషిత నీటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి అమినిటీస్ కార్యదర్శి క్షేత్రస్థాయిలో వెళ్లి అతిసారం ప్రబలకుండా చూడాలన్నారు.

March 3, 2026 / 04:18 PM IST

బోనకల్లో కోతుల పట్టివేత.. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

KMM: బోనకల్ మండల కేంద్రంలో కోతుల బెడదతో ఇబ్బంది పడే ప్రజలకు సర్పంచ్ జ్యోతి శుభవార్త చెప్పారు. మంగళవారం ప్రత్యేక బృందంతో గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కోతలను పట్టుకొని బంధించారు. బంధించిన కోతులను అటవీప్రాంతంలో వదిలేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ పంచాయితీలో కోతుల బెడద అధికంగా ఉన్న సమయంలో వాటిని పట్టుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 04:16 PM IST

రాజ్యసభ ఎన్నికలపై KCRతో కేటీఆర్ చర్చ

TG: రాష్ట్రంలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, కేటీఆర్‌కు దిశానిర్దేశం చేశారు. సంఖ్యాబలం, అభ్యర్థుల ఎంపిక, ఇతర రాజకీయ సమీకరణాలపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, సభలో పార్టీ గొంతుకను ఎలా బలంగా వినిపించాలనే అంశాలపై కేటీఆర్‌కు కేసీఆర్ పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.

March 3, 2026 / 04:16 PM IST

గుంతల మయంగా తయారైన రోడ్డు.. ప్రజల అవస్థలు

NLR: కొడవలూరు మండలం యల్లాయిపాలెం నుంచి పాటూరు వెళ్లే రహదారిపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాళ్ల తేలి అధ్వాన్నంగా మారింది. ఈ మార్గం వెంబడి ప్రయాణం చేయాలంటే వాహనదారులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

March 3, 2026 / 04:15 PM IST

ఉప్పాడలో వెనక్కి వెళ్ళిన సముద్రం

కాకినాడ: ఉప్పాడ సముద్రం ఊహించలేని రీతిలో సుమారు 500 మీటర్ల పైన సముద్రం వెనక్కి వెళ్ళింది. ఇటీవల కాలంలో ఆటుపోటుల కారణంగా వెనక్కి వెళ్లి ముందుకు రావడం జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం ఊహించలేని రీతిలో సముద్రం వెనక్కి వెళ్ళింది. ఉప్పాడ పాత మార్కెట్, సుబ్బంపేట, ఎస్ పి జి ఎల్ శివారు వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది.

March 3, 2026 / 04:15 PM IST

తీవ్ర జ్వరంతో చరణ్‌ డ్యాన్స్‌ చేశాడు: బుచ్చిబాబు

‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ పాటపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ చిరుకి థ్యాంక్యూ చెప్పాడు. ‘ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. తీవ్ర జ్వరం ఉన్న చరణ్ ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేశాడు. షూటింగ్ ఆపేద్దామని చెప్పిన ఆయన వినలేదు. ఆ డెడికేషన్, ఆ ఆటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే’ అంటూ రీట్వీ...

March 3, 2026 / 04:15 PM IST

‘అమెరికా, ఇజ్రాయెల్‌ దుశ్చర్యను ఖండించాలి’

SRPT: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేస్తున్న దాడులను సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల నాయకులు నల్లగొండ నాగయ్య, డేగల వెంకటకృష్ణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో అమెరికా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద కాంక్షతో అగ్రరాజ్యం అమాయక పౌరులను బలితీసుకోవడం దారుణమన్నారు.

March 3, 2026 / 04:14 PM IST

ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆరు రోజుల పుణ్యక్షేత్ర యాత్ర

NRML: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో మార్చి 8న ఆరు రోజుల పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పండరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూరి జగన్నాథ దేవాలయం సహా పలు క్షేత్రాలు సందర్శనకు గాను పోను–రాను కలిపి ఒక్కొక్కరికి రూ. 6400గా నిర్ణయించారు. నమోదు కోసం నిర్మల్ బస్టాండ్‌లో సంప్రదించాలన్నారు.

March 3, 2026 / 04:14 PM IST

హిందూపురంలో ఘనంగా పోలీసుల రక్తదాన శిబిరం

సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా హిందూపురంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అదనపు జిల్లా జడ్జి శైలజ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందమందికి పైగా యువత రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

March 3, 2026 / 04:14 PM IST

కొమ్మాల వ్యాపారులకు ‘నీడ’ కష్టాలు..!

WGL: గీసుగొండ మండలంలోని కొమ్మాల జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల వ్యాపారులకు నీడ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎండలు పెరగడంతో దుకాణాల ఎదుట వ్యాపారులు నీడ కోసం షేడ్ నెట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటితో రహదారి ఇరుకుగా మారుతుందని గతంలో వాటిని పోలీసులు తొలగించారు. కాగా, ఎండ వేడితో దుకాణాలకు భక్తులు ఎవరూ రావడం లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

March 3, 2026 / 04:14 PM IST