• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సోమలింగేశ్వర ఆలయ ఛైర్మన్‌గా మహేశ్ పటేల్

KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి సోమలింగేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్‌గా దుర్గం మహేష్ పటేల్‌ను ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం నియమించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కమల, ఆలయ పునర్నిర్మాణ దాత పోచారం శంభు రెడ్డి, మహేందర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, జడ్పీటీసీ మాజీ సభ్యులు లక్ష్మి కిషోర్, మాజీ ఎంపీపీ విటల్, మాజీ సర్పంచ్ మోహన్ ఉన్నారు.

March 3, 2026 / 06:01 AM IST

పుష్కర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి: జేసీ

W.G: 2027లో జరగనున్న పుష్కరాల సన్నాహకలపై భీమవరంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారి మరమ్మతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

March 3, 2026 / 06:01 AM IST

గిరిజన బాల బాలికలకు శిక్షణ

MDK: బోయిన్‌‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి వీ. నీలిమ తెలిపారు. గిరిజన బాలబాలికలకు కాయాకింగ్, కెనోయింగ్, రోయింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

March 3, 2026 / 06:01 AM IST

సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు

SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. వర్గల్ మండలం సీతారాంపల్లి, నాచారం, జగదేవపూర్ మండలం చాట్లపల్లి, గజ్వేల్ మండలం దాతర్ పల్లి, కొండపాక మండల కేంద్రానికి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

March 3, 2026 / 06:01 AM IST

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురికి తీవ్ర గాయాలు

BPT: కారంచేడు-పర్చూరు రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కారంచేడు నుండి పర్చూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

March 3, 2026 / 06:00 AM IST

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రకాశం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

March 3, 2026 / 06:00 AM IST

ప్రాణం తీసిన ఫోన్ మోజు

కృష్ణా: మిత్రుడు తీసుకెళ్లిన ఫోన్ తిరిగి అందకపోవడంతో ఏర్పడిన మానసిక ఒత్తిడి ఓ యువకుడి ప్రాణాలను తీసింది. పోలీసుల సమాచారం మేరకు NTR (D) చందర్లపాడు(M) చింతలపాడుకి చెందిన బత్తుల నరసింహారావు (19) కొంతకాలంగా పునాదిపాడులో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల వణుకూరు చెందిన స్నేహితుడు అతని ఫోన్ తీసుకెళ్లగా, పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.

March 3, 2026 / 06:00 AM IST

నేడే హోలీ.. సెలవు: డీఈవో

ATP: పాఠశాలలకు హోలీ పండుగ సెలవు మంగళవారమే ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్‌ బాబు ప్రకటించారు. గతంలో మార్చి 4న సెలవుగా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 3నే సెలవు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం నుంచి పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.

March 3, 2026 / 05:58 AM IST

నేడు సెలవు.. రేపు హోలీ పండుగ!

హోలీ ఎప్పుడు జరుపుకోవాలని చాలా మంది అయోమయంలో ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం ఇవాళ పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ సర్కారు హాలిడే ప్రకటించింది. మద్యం దుకాణాలు రేపు ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఇవాళ చంద్రగ్రహణం ఉండటంతో రేపు హోలీ పండుగ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

March 3, 2026 / 05:55 AM IST

‘ఫైర్ సేఫ్టీ నిబంధనలను ‘తప్పక పాటించాలి

NLR: ఆటోనగర్‌లో అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యజమానులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

March 3, 2026 / 05:54 AM IST

ఏఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పలు వాహనాలు సీజ్

నెల్లూరు నగరంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ సోమవారం దాడులు నిర్వహించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమేశ్వరి ఆలయ సమీపంలోని ఒక దాబాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 22 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 3, 2026 / 05:49 AM IST

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

TPT: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన దాత బత్తల ఇషాన్ మహాదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని దాతల విభాగంలో అధికారికి చెక్కును అందజేశారు. భక్తుల ఆరోగ్య సేవల కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

March 3, 2026 / 05:49 AM IST

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం  9.30 గంటలలకు మాజీ లోకసభ స్పీకర్, దివంగత GMC.బాలయోగి వర్ధంతి సందర్భంగా దిండి Y జంక్షన్‌లో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పిస్తారు. 10.30 గంటలకు చింతలపల్లి గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

March 3, 2026 / 05:49 AM IST

నటి కారుకు ప్రమాదం.. డ్రైవర్‌ దుర్మరణం

ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న ముత్తుగణేష్ అక్కడికక్కడే మృతిచెండాడు. దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె పీఏ దివాకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

March 3, 2026 / 05:45 AM IST

హోలీ వేడుకల్లో అల్లరి చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

VKB: హోలీ పండుగను ప్రమాదాలకు దూరంగా, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని బంట్వారం ఎస్సై విమల సూచించారు. వేడుకల పేరుతో మహిళలు, యువతులపై బలవంతంగా రంగులు పూయడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మత్తులో వాహనాలు నడిపి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

March 3, 2026 / 05:44 AM IST