నెల్లూరు నగరంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ సోమవారం దాడులు నిర్వహించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమేశ్వరి ఆలయ సమీపంలోని ఒక దాబాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 22 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.