TG: లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్‌ను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని.. పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోదీ.. మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదన్నారు. కానీ ప్రజల కోసం పోరాడిన వాళ్లపై తమకు గౌరవం ఉంటుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్నారు.