KNR: దుద్దెనపల్లి కేతిరి మల్లారెడ్డి బ్రిడ్జి నుంచి ఎక్లాస్పూర్ వెళ్లే కాలువలో తుంగ, చెట్లు పెరిగి సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులకు తెరపడింది. ఈ సమస్యపై సర్పంచ్ విజయ స్పందించి జేసీబీతో కాలువను శుభ్రం చేయించారు. దీంతో సాగునీటి కష్టాలు తీరాయని దుద్దెనపల్లి, ఎక్లాస్పూర్ రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.