• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈ నటుడెవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో హనుమంతుడి గెటప్‌లో ఉన్న ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరై ఉంటారా? అంటూ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో చూస్తున్న మీకైనా ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం.

March 3, 2026 / 05:38 PM IST

గ్రామాలలో స్వచ్ఛందంగా మద్యపానం నిషేధం

JNG: బచ్చన్నపేట మండల కేంద్రంలోని కోవడాటూరు, చిన్న రామన్ తండా, లింగంపల్లి తదితర గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్యపానం నిషేధించాలని నిర్ణయించారు. మంగళవారం గ్రామస్థులు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మితే ఒక లక్ష జరిమానా, పట్టించిన వారికి పదివేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.

March 3, 2026 / 05:35 PM IST

‘ఆసుపత్రి సేవలపై పెరుగుతున్న నమ్మకం’

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అందిస్తున్న సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన నెలలో 22,447 మంది ఔట్ పేషెంట్లు, 1872 మంది ఇన్ పేషెంట్లు వివిధ విభాగాలలో సేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రభుత్వాసుపత్రిలో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

March 3, 2026 / 05:34 PM IST

బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి: రోజా

AP: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవికి అనర్హుడని మాజీమంత్రి రోజా ధ్వజమెత్తారు. ‘ఆయన రాజీనామా చేయాలి. ఇందు పరువు తీసింది బీఆర్ నాయుడే. నిజం లేకపోతే బాబు, లోకేష్, పవన్‌లకు ఇందు ఎందుకు లేఖ రాసింది. ఆయనకు మహిళలంటే గౌరవం లేదు. ఆ వీడియోపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 05:33 PM IST

ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ఆయుధం ఎస్‌.ఐ.ఆర్

అన్నమయ్య: రాయచోటిలోని ఎన్జీవో హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కొనండి– మీ ఓటు భద్రం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓటరు సవరణలో అర్హులైన వారికి కూడా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ఆయుధం ఎస్‌.ఐ.ఆర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

March 3, 2026 / 05:33 PM IST

కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది: ఎంపీ

NTR: ఏపీ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్ మంగళవారం ఎంపీ కేశినేని చిన్నిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు.

March 3, 2026 / 05:32 PM IST

కోడి పందాలపై తొర్రూరు పోలీసుల దాడి

MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామ శివారు మామిడి తోటలో ఇవాళ కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 25 పందెం కోళ్లు, రూ.65,000 నగదు, ఒక కారు, 5 ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 05:31 PM IST

కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు

CTR: పెనుమూరు మండలంలో వరుసగా కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇతర కేబుల్ వైర్లు అపహరించబడుతున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

March 3, 2026 / 05:30 PM IST

బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా హరీశ్

సత్యసాయి: జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పెనుకొండకు చెందిన ఎం. హరీశ్‌ను నియమిస్తూ పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. హరీశ్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

March 3, 2026 / 05:29 PM IST

అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత

ADB: ఇచ్చోడ మండలం గుండాల గ్రామ శివారులో ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను ఇచ్చోడ FRO నాగవత్ స్వామి, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ గుర్తించారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

March 3, 2026 / 05:28 PM IST

రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రాత్లవత్ రాములు (91) మరణించారు. SI మహేశ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఐ20 కారు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న రాములను బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 3, 2026 / 05:28 PM IST

రూ.96 లక్షల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు

ATP: గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో రూ.96 లక్షల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం అధికారులు చేపట్టారు. గతవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాంకు గ్రామంలో నూతన రోడ్డు వేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జయరాం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 05:26 PM IST

జగన్‌ను కలిసిన డిప్యూటీ సీఎం

AP: మాజీ సీఎం జగన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు.

March 3, 2026 / 05:25 PM IST

రాజమండ్రిలో రహదారి మళ్ళింపు

E.G: రాజమండ్రి ఇన్నిస్ పేట గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ సెంటర్ నుండి ఆర్య వైశ్య రామాలయం వరకు రోడ్, డ్రైనేజీ వర్క్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా మంగళవారం ఆర్‌మ్‌సీ అధికారులు రహదారి మళ్లించారు. వాహనదారులు ప్రక్కన అన్నపూర్ణ థియేటర్ రోడ్, ప్రత్యామ్నాయ మార్గాల్లోనికి వెళ్లాలని సూచించారు. పనులు పూర్తయ్యే వరకు అంతరాయానికి సహకరించాలని కోరారు.

March 3, 2026 / 05:25 PM IST

జనసేన పార్టీ సభ్యత్వం ఒక బాధ్యత

ELR: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ మెంబర్షిప్ కాదని, ఇది ఒక బాధ్యత, ఒక నిబద్ధత, ఒక సంకల్పం అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జీ రెడ్డి అప్పల నాయుడు అన్నారు. మంగళవారం ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50 డివిజన్ లోను వివిధ సెంటర్లలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు జరుగుతున్న శిబిరాలను ఆయన సందర్శించారు.

March 3, 2026 / 05:24 PM IST