MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని జ్యోతి నగర్లో అభివృద్ధి పనులకు కౌన్సిలర్ పుల్లూరి తిరుమల కళ్యాణ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సహకారంతో రూ.4 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.