పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు YCP రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు YS.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.