• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జగన్‌తో వివాదం నాకు నష్టమే: RRR

AP: రాష్ట్ర రాజకీయాల కంటే ఢిల్లీ రాజకీయాలే మేలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జగన్‌తో వివాదం తనకు రాజకీయంగా నష్టమేనని అన్నారు. ‘కూటమి తరఫున ఖరారైన 174 సీటు నాదే.. నా తర్వాత ఒకటే మిగిలింది. ఎవరి మెప్పుకోసమో నేను జగన్‌తో గొడవ పెట్టుకోలేదు. జగన్ అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవడం లేదు. జగన్‌పై నాకు పగలేదు’ అని వెల్లడించారు.

April 4, 2026 / 09:21 PM IST

ఐరన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారా?

శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఐరన్ మాత్రలను పరగడపున తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మాత్రలు వేసుకున్న గంట వరకు పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఇతర మందులతో వీటిని కలిపి వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

April 4, 2026 / 09:20 PM IST

BREAKING: GTపై రాజస్థాన్ భారీ స్కోర్

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ 210/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సూర్యవంశీ, జైస్వాల్ తొలి వికెట్‌కు కేవలం 6.2 ఓవర్లలోనే 70 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. సూర్యవంశీ (31) ఔటైనా,  జైస్వాల్ (55) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం జురెల్(75) కూడా మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో స్కోర్ 200 మార్కును దాటింది. రబడ 2 వికెట్లు పడగొట్టాడు.

April 4, 2026 / 09:19 PM IST

ముగిసిన సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు నగిరి వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కొక్క వాహనంపై పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమాలకు సహకరించినవారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

April 4, 2026 / 09:15 PM IST

ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ

MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన పులిగుజుల అనూష (22)ను ఆమె భర్త సాయి అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురై, ఇంట్లో ఎవరు లేని సమయంలో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

April 4, 2026 / 09:12 PM IST

భార్య దూరం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

HNK: దామెర మండలం ఒగ్లాపూర్‌కు చెందిన పోలు రాజు (31) భార్య ఏడాదిగా దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 4, 2026 / 09:12 PM IST

ఏడేళ్ల కొడుకును చిత్రహింసలు పెట్టిన తండ్రి

AP: కాకినాడ జిల్లా ఒమ్మంగిలో దారుణం చోటుచేసుకుంది. ఆటో సీటు చింపాడని పక్కింటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఓ తండ్రి తన ఏడేళ్ల కుమారుడిని ఇనుప చువ్వలతో కొట్టి, దారుణంగా వాతలు పెట్టాడు. ఊరి నుంచి వచ్చిన తన సోదరి చూసేటప్పటికి బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. చలించిపోయిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు.

April 4, 2026 / 09:12 PM IST

‘మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలి’

KNR: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం HYD నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఈఆర్‌వోలు, ఏ ఈ ఆరీలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్‌పై సమావేశం నిర్వహించారు.

April 4, 2026 / 09:11 PM IST

రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది: నారాయణ

TG: దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని సీపీఐ నేత నారాయణ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయాలని.. లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు. రాజకీయ అవినీతిని ప్రజలకు వివరించడం కోసం ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్ని విధాలుగా భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.

April 4, 2026 / 09:09 PM IST

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మిథున్ రెడ్డి

మహబూబు‌బ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రత్నపు గంగాధర్ శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి శనివారం వెంకటేశ్వర కాలనీలోని వారి నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.

April 4, 2026 / 09:08 PM IST

‘అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి’

MNCL: దండేపల్లిలో నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు అందరూ విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘం మండల నాయకులు లింగంపల్లి బాపు తదితరులు కోరారు. శనివారం దండేపల్లి ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అందరివాడని అన్నారు. ఏప్రిల్ 14న దండేపల్లి మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

April 4, 2026 / 09:07 PM IST

ట్రాన్స్‌జెండర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

JGL: హైదరాబాద్ గచ్చిబౌలిలోని NITHMలో ట్రాన్స్‌జెండర్‌లకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణలు అందిస్తారు. 91 మందికి లబ్ధి చేకూరే ఈ కార్యక్రమానికి రూ. 17.72 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

April 4, 2026 / 09:06 PM IST

IPL: రేపు సూపర్ సండే

ఐపీఎల్‌లో భాగంగా రేపు ఆదివారం కావడంతో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ వేదికగా జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇక రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది.

April 4, 2026 / 09:05 PM IST

ఏప్రిల్ 6 నుంచి 11 వరకు హెల్త్ వీక్

HYD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా HYDలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపుతో పాటు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

April 4, 2026 / 09:03 PM IST

ఉప్పల్‌లో SRH మ్యాచ్.. వాటికి నో ఎంట్రీ

రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH vs LSG మ్యాచ్‌కు వచ్చే అభిమానులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి పవర్ బ్యాంకులు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సిగరెట్లు, లైటర్లు, పెన్నులు, వాచీలు, హెడ్‌సెట్స్, బ్యానర్లను అనుమతించరు. నీళ్ల సీసాలు, బయటి ఆహారానికి కూడా అనుమతి లేదు. కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

April 4, 2026 / 09:02 PM IST