• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ

సత్యసాయి: లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేసేందుకు పై అంతస్తులో సర్కిల్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 12:36 PM IST

ఒంటిమిట్టలో హరిద్ర ఘటనం ప్రారంభం

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం హరిద్ర ఘటనం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి శుభారంభంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 25, 2026 / 12:36 PM IST

తేనెటీగల దాడి.. కానిస్టేబుల్ మృతి

NDL: శ్రీశైలం డ్యాం వద్ద తేనెటీగల దాడి విషాదం సృష్టించింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52)పై తేనెటీగలు దాడి చేశాయి. లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. భయంతో కిందపడిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 12:36 PM IST

రేపు మార్కెట్ బహిరంగ వేలం పాట

PPM: సీతంపేట గ్రామ పంచాయతీ వారపు సంత, రోజువారీ మార్కెట్ బహిరంగ వేలం పాటను ఈనెల 26న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి బీ. రామకృష్ణ తెలిపారు. ఈ నెల 25న జరగాల్సినప్పటికీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆశీలు వసూళ్లకు సంబంధించి ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చునని కోరారు.

March 25, 2026 / 12:35 PM IST

జి్ల్లాలో ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం

CTR: గుడిపాల (M)నికి చెందిన ఓ మైనర్ బాలిక చిత్తూరులో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక 23వ తేదీ కాలేజీకి వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. పలమనేరు మండలానికి చెందిన మరో బాలిక సైతం ఆదివారం చిత్తూరులో మిస్సయిన ఘటనపై కేసు నమోదు అయింది.

March 25, 2026 / 12:33 PM IST

లోక్ అదాలత్‌లో సత్వర పరిష్కారం: మోతె ఎస్సై

SRPT: మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మోతే ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. పెండింగ్ కేసులు, చిన్నపాటి వివాదాలు, ట్రాఫిక్ చలానాలు వంటి సమస్యలను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్‌లో పరస్పర సమ్మతితో తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

March 25, 2026 / 12:32 PM IST

RR విక్రయం.. వార్న్ ఫ్యామిలీకి రూ.450 కోట్లు

రాజస్థాన్ జట్టును అమెరికాకు చెందిన కన్సార్షియం రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టీమ్ తొలి కెప్టెన్, దివంగత క్రికెటర్ షేన్ వార్న్ ఫ్యామిలీ రూ.450 కోట్లు పొందింది. అదెలా అంటే.. IPL ప్రారంభంలో రాజస్థాన్ క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించినందుకు 4 సీజన్లలో 0.75 చొప్పున 3% యాజమాన్య వాటా వార్న్ సొంతమైంది. దానితోనే వార్న్ కుటుంబం ఇప్పుడు లబ్ధి పొందింది.

March 25, 2026 / 12:32 PM IST

రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో లోకేష్

AP: మంగళగిరి పట్టణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య హనుమత్ లక్ష్మణ సీతాసమేత రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు.  స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవాలయం పునర్నిర్మాణానికి మంత్రి లోకేష్ రూ.5 లక్షల విరాళం అందించారు.

March 25, 2026 / 12:31 PM IST

భవిష్యత్ తరాల కోసం నీటిని వృధా చేయకూడదు

BDK: భవిష్యత్తు తరాల కోసం నీటిని వృథా చేయకుండా ప్రతి బొట్టును పొదుపు చేయాలని భూగర్భ జల శాఖ అధికారులు కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మణుగూరులోని ఎస్టీ బాలికల వసతి గృహంలో అవగాహన సదస్సు నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ పద్ధతులపై అధికారులు విద్యార్థులు, రైతులకు వివరించారు.

March 25, 2026 / 12:31 PM IST

నీటి కుంటలో పడి వృద్ధురాలు మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలం నరవ గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి ఓ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 12:30 PM IST

పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: పౌరసరఫరాల శాఖ

BDK: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌కు కొరత లేదని పౌరసరఫరాల శాఖ ఇవాళ పేర్కొంది. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని, ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగినట్లు చెప్పింది.

March 25, 2026 / 12:29 PM IST

సామాజిక భవనానికి మరమ్మతులు ప్రారంభం

AKP: గొలుగొండ(మం) కృష్ణదేవిపేటలో శిధిలావస్థలో ఉన్న సామాజిక భవనం మరమ్మతులు, ప్రహరీ గోడ, సీసీ రోడ్డు పనులను ఎంపీపీ గజ్జల మణికుమారి, సర్పంచ్ పందిరి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఎంపీపీ నిధులలో భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు, సీసీ రోడ్డు పనులకు రూ.2.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:29 PM IST

ఈ నెల 31న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మార్చి 31న రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.

March 25, 2026 / 12:28 PM IST

ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న మంత్రి పొన్నం

TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంత్రం భేటీ కానున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో చర్చించనున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆర్టీసీ సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకురావాలని పొన్నం కోరారు.

March 25, 2026 / 12:26 PM IST

పొన్నలూరులో ఉచిత పశు వైద్య శిబిరం

ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడులో మార్కెట్ కమిటీ యార్డ్ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం డాక్టర్ శివరామకృష్ణ పశువులకు గాలికుంట వ్యాధులు రాకుండా టీకాలు వేశారు. పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామస్తులకు జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ కర్నా తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:25 PM IST