• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏలూరు జిల్లాస్థాయి కార్యశాల సమావేశం

ఏలూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026)” జిల్లా స్థాయి కార్యశాల సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓటరు జాబితా సవరణలో పారదర్శకతను పెంపొందించే దిశగా, క్షేత్రస్థాయిలో BLOలు, BLAలతో సమన్వయం చేసుకుంటూ, తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక వివరించారు.

March 24, 2026 / 07:10 PM IST

వరంగల్‌లో కల్తీకారం పట్టివేత..!

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీ పై మంగళవారం సాయంత్రం ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో మిర్చి తొడిమలతో కల్తీ చేసి కారం తయారు చేస్తున్నట్లు గుర్తించి, 70 కిలోల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

March 24, 2026 / 07:09 PM IST

అడెల్లి మహా పోచమ్మ హుండీ ఆదాయం రూ. 53 లక్షలు

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 15 హుండీల ద్వారా రూ. 53,97,520 నగదు ఆదాయం లభించింది. అదనంగా 125.490 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి సమకూరింది. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

March 24, 2026 / 07:08 PM IST

బద్దెనపల్లిలో ప్రపంచ నీటి దినోత్సవం

SRCL: ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని తంగల్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో ఉన్న రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన కల్పించారు. బస్టాండ్ నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం భూగర్భ జల అధికారి ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. భూగర్భ జలాల ప్రాధాన్యత, వాటి సంరక్షణకు తీసుకోవాలన్నారు.

March 24, 2026 / 07:07 PM IST

తాండూరు గ్రామ పంచాయతీలో పర్యటించిన అదనపు కలెక్టర్

MNCL: ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాండూరు గ్రామ పంచాయతీలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మంగళవారం పర్యటించారు. నర్సరీని సందర్శించి, శానిటేషన్ పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి సైడ్ డ్రెయిన్ శుభ్రంగా ఉండాలని, సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. OHSR ట్యాంకులను ప్రతి 10రోజులకు ఒకసారి శుభ్రపచాలని సూచించారు.

March 24, 2026 / 07:07 PM IST

‘ఓటర్ మ్యాపింగ్‌కు పార్టీల సహకారం అవసరం’

KRNL: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి కోరారు. జిల్లాలో మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోందన్నారు. బీఎల్వోలు, బూత్ ఏజెంట్లు సమన్వయంతో పని చేసి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈవీఎంల భద్రతపై కూడా పరిశీలన చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

March 24, 2026 / 07:05 PM IST

జిల్లాలో టమాటా ధరల వివరాలు

CTR: మంగళవారం పుంగనూరు మార్కెట్లో టమాటా ధరలు పది కిలోలకు గరిష్టంగా రూ. 94, కనిష్టంగా రూ. 80గా నమోదయ్యాయి. పలమనేరులో గరిష్టంగా రూ. 106, వీకోటలో రూ. 90 వరకు పలికాయి. రానున్న వేసవిలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న రైతులు, బోరు బావుల వద్ద నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో టమాటా సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. మార్కెట్ ఒడిదుడుకులపై రైతులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు.

March 24, 2026 / 07:05 PM IST

రెవెన్యూ, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

తిరుపతి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మార్చి 24న అధికారులతో కలెక్టరేట్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యుటేషన్లు, భూ రీసర్వే, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలైన PGRS, IVRS ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

March 24, 2026 / 07:05 PM IST

అన్యాయంపై ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య

HNK: గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల పార్లమెంట్లో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ఈ హామీని అమలు చేయాలని, తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు.

March 24, 2026 / 07:05 PM IST

ఆసిఫాబాద్‌లో వార సంతకు వేలం

ASF: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ చునర్కర్ సతీష్ ఆధ్వర్యంలో వారసంతకు వేలం నిర్వహించారు. వేలం పాటలో ఇద్దరు పాల్గొనగా రూ.9.51 లక్షలకు శంకర్ దక్కించుకున్నాడు. గాతేడాది రూ.8.49 లక్షలు పల్కగా ఈసారి రూ.1 లక్ష 2 వేలు అధికంగా గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో వాంకిడి ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

March 24, 2026 / 07:05 PM IST

‘శానిటేషన్ లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు’

JGL: జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలోని శానిటేషన్ వాహనాల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ వద్ద వాహనాలను ఆమె స్వయంగా పరిశీలించారు. సకాలంలో ఆయిల్ చేంజ్ చేస్తూ ఫిట్నెస్‌ను కాపాడాలని, మరమ్మతుల్లో ఉన్న వాహనాలను వెంటనే అందుబాటులోకి తేవాలని సూచించారు.

March 24, 2026 / 07:04 PM IST

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులకు జైలు శిక్ష

లైసెన్సు లేని మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధిస్తారు. వాహనం ఆర్సీ ఏడాది పాటు రద్దు చేస్తారు. అలాగే, సదరు మైనర్లకు 25 ఏళ్ల వరకు లైసెన్స్ ఇవ్వరు. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా వర్తించదు.

March 24, 2026 / 07:03 PM IST

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: కలెక్టర్

MDK: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ, ఇంట్రా గ్రిడ్, గ్రిడ్, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ, గ్రౌండ్ వాటర్, మున్సిపల్ కమిషనర్స్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

March 24, 2026 / 07:02 PM IST

పది కూడా పాస్ కాలే.. 20 ఏళ్లుగా నకిలీ వైద్యం

TG: నకిలీ వైద్యం చేస్తున్న డెంటిస్ట్ గుట్టురట్టు అయ్యింది. యూపీకి చెందిన రమేష్ అనే వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం HYDకి వచ్చాడు. పదో తరగతి కూడా చదవకుండా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా అవతారమెత్తాడు. నేరేడ్‌మెట్ పరిధిలో ఒక డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

March 24, 2026 / 07:01 PM IST

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: BSP

SDPT: హుస్నాబాద్ పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను మున్సిపాలిటీలో జరగబోయే పాలకవర్గ సమావేశంలో అత్యవసరంగా చర్చించి పరిష్కరించాలని హుస్నాబాద్ బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ పచ్ఛిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. పట్టణంలో కోతుల సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. కోతుల దాడిలో పలువురు గాయపడ్డా ప్రభుత్వ నుంచి ఎలాంటి చలనం లేదన్నారు.

March 24, 2026 / 07:01 PM IST