KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానం డైరెక్టర్‌గా పెద్దకడబూరుకు చెందిన చెందిన జిలకర సావిత్రి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. పెద్దకడబూరు మండల జనసేన పార్టీ నాయకులు జిలకర గణేష్ తల్లి జిలకర సావిత్రి జనసేన పార్టీ తరుపున ఉరుకుంద ట్రస్ట్ డైరెక్టర్ గా నియమిలయ్యారు.
MNCL: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక జీపీవోల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు.
SRD: పటాన్ చెరువు పట్టణంలో భారీ CSR నిధులతో నిర్మాణంలో ఉన్న “సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్”కు దివంగత డా. కిషన్ రావు పేరు పెట్టేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, నూతన ఆసుపత్రికి కిషన్ రావు పేరు పెట్టించే దిశగా చర్యలు తీసుకుంటానని కస్బా బృంద సభ్యులతో ఆయన పేర్కొన్నారు.
టీమిండియాకు అశ్విన్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు ప్రస్తుతం నెట్ రన్‌రేట్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై విజయం సాధించడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించాడు. అలాగే, బ్యాటర్లు కూడా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తమ షాట్ల ఎంపికపై శ్రద్ధ వహించాలని అశ్విన్ సూచించాడు.
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో కమిషనర్ మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌లను తక్షణమే రెన్యువల్ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌కు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిబంధనల ప్రకారం 25% పెనాల్టీ విధిస్తామన్నారు.
ELR: షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో హౌరా వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయవాడ సమీపంలో ఒక్కసారిగా స్పృహ తప్పారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఏలూరులో వైద్య పరీక్షలు నిర్వహించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రైల్వే ఎస్సై దానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను కోహెడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనిగరం గ్రామ శివారులో తనిఖీల సందర్భంగా TG36-T-2838 నంబరు గల ట్రాక్టర్ పట్టుబడింది. డ్రైవర్ దర్శనం రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. కోహెడ ఎస్సై పి. అభిలాష్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
AP: సీఎం చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు.
NGKL. కుమ్మెర ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ నేత రామచందర్ రావు మండిపడ్డారు. గుడి, బడి వంటి బహిరంగ ప్రదేశాల్లో కులవివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే ఎక్స్రేషియా ప్రకటించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
GDWL: జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని వివరించారు.
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ మోహినికుంట మల్లిఖార్జున స్వామి ఆలయ హుండీని ఈనెల 28న ఉదయం 11 గంటలకు లెక్కించబడునని ఆలయ పూజారి భద్రయ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆలయ ఆవరణలో జరిగే హుండీల లెక్కింపునకు పర్యవేక్షణకు దేవాదాయ శాఖ, జగిత్యాల డివిజన్ పరిశీలకులు పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో హుండీలు లెక్కించబడునని పేర్కొన్నారు.
WG: జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
BPT: ఈపూరుపాలెం వద్ద ధ్వంసమైన సముద్ర ముఖద్వారాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పరిశీలించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో మత్స్యకారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. సముద్ర తీరాన్ని ధ్వంసం చేసిన శ్రీ భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ పట్టాలను రద్దు చేసి, అక్రమ రిసార్టులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్ష CS వెంకటకేశవులు తెలిపారు. ఫస్టియర్ 200 మంది, సెకండియర్ 187 మంది ఉండగా.. మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వాహిష్ఠమని ఆయన పేర్కొన్నారు.