W.G: అండలూరులో విద్యుత్ స్తంభంపై పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోడూరు మండలం వద్దిపర్రకు చెందిన అజయ్ కుమార్ (18) అండలూరులో శుక్రవారం స్తంభంపై పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. 11 మందికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుంది. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలో చెందుతున్నారు. కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. కాగా ఇవాళ పేషెంట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించనున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 పెరిగి రూ.1,51,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరిలో నిర్వహించిన దావత్ -ఈ -ఇఫ్తార్ విందులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ముస్లింతో కలిసి ఉపవాస విరమణ చేసి, రంజాన్ మాసపు ఆధ్యాత్మికతను పంచుకున్నారు. ఈ పవిత్ర మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.
CTR: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూను కచ్చితంగా అమలు చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలన్నారు. ఇందులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. భోజనంపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా హెచ్ఎంలు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.
ATP: తాడిపత్రి మండలం ఆలూరుకోన క్షేత్రంలో శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శేష తల్ప రంగనాథ స్వామివారు దివ్య మంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాథుని దర్శనంతో భక్తులు పులకించిపోయారు.
SRD: వివాహిత అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పిఎస్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళంకు చెందిన అప్పలనాయుడు ముత్తంగి డివిజన్‌లో నివసిస్తూ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈనెల 26న డ్యూటీకి వెళ్లి రాత్రి ఇంటికి రాగానే భార్య మాధవి కనిపించలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి రీల్స్ చేశారు. శ్రీవారి ఆలయం దగ్గర గీతూ రాయల్ అండ్ టీం రీల్స్ తీశారు. ఘాట్ రోడ్డుతో పాటు శ్రీవారి ఆలయం దగ్గర ఓ పాటకు గీతూ రాయల్ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తిరుమలలో రీల్స్ చేసే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
KMR: ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నట్లు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించి, ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ప్రజలందరూ హాజరుకావాలని కోరారు.
BPT: ఎం.వి. రాజుపాలెం గ్రామానికి చెందిన శీలం సుబ్బారెడ్డికి డయాలసిస్ పింఛన్‌ను తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వారికి ప్రత్యేక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి నెలా సమయానికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
SRCL: వేములవాడ నియోజకవర్గంలోని ఫాజుల్ నగర్ మీదుగా రుద్రంగి వరకు గల చెరువులు నింపేందుకు నారాయణపూర్ వద్ద రెండో మోటార్ ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని VMWD విప్ ఆది శ్రీనివాస్ కోరారు. చొప్పదండి MLA మేడిపల్లి సత్యంతో కలిసి శుక్రవారం HYD మంత్రిని కలిశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులపై మంత్రితో చర్చించారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాల్క సుమన్ కెసీఆర్ ఫామ్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు మాజీ సర్పంచ్ చీకటి ప్రకాశ్ తెలిపారు.
E.G: నిబద్ధతగా పనిచేసే సేవా సంస్థలపై చిన్నచూపు తగదని.. ప్రభుత్వం తమను గుర్తించాలని ఎన్జీవోలు కోరారు. రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఎన్జీవో ఐ.కుమార్ అధ్యక్షతన ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వర్ణాంధ్ర సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 ఎన్జీవో సంస్థలు పాల్గొన్నాయి.
HYD: నగరంలో గత ఏడాదిలో జలమండలి పరిధిలో లక్షకు పైగా నల్లా కనెక్షన్లు పెరిగినట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. నగర కోర్ ప్రాంతంతో పోలిస్తే ORR పరిధిలో నీటి వినియోగం, సరఫరా గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా పైప్‌లైన్ విస్తరణ, రిజర్వాయర్ల సామర్థ్య పెంపు వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.