KDP: యోగివేమన యూనివర్సిటీ పీజీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ తెలియజేసారు.ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా,సంబంధిత ఒరిజినల్ సర్టిఫి కెట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
CTR: విజయపురం(మం) కొసలనగరం మీట్టూరు శ్రీ రామక్కమ్మ ఆశ్రమం నందు మంగళవారం 46వ ఆరాధాన ఉత్సవాలు ఆశ్రమ నిర్వాహలు వాసుదేవ స్వామి నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఉదయం నుంచి దర్శన ఏర్పాట్లు, అన్నదానం ఏర్పాటు చేశారు. కోలాటం, చెక్కభజన, హారికధ, ప్రదర్శించారు.
PLD: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతి నెల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా వెల్లడించారు. మంగళవారం నరసరావుపేటలో కోడెల క్రీడా ప్రాంగణంలో జరిగిన జూనియర్ అండర్-18 సైక్లింగ్ (వ్యక్తిగత, మాస్టర్ విభాగాలు) పోటీలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
ఆహార నాణ్యత, పోషకాలను పర్యవేక్షించే కొత్త ఏఐ వ్యవస్థను ఉద్యోగ్ యంత్ర ఏఐ సంస్థ ప్రదర్శించింది. ఏఐ సెన్సర్లు, కెమెరాల ద్వారా వంటలో వాడే దినుసుల పరిమాణాన్ని, నాణ్యతను ఇది గణిస్తుంది. వంట పూర్తయ్యాక అందులోని క్యాలరీలు, విటమిన్ల వివరాలను తెరపై చూపిస్తుంది. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సంస్థ తెలిపింది.
ELR: తంగెళ్ళమూడిలోని గౌరీ దేవి గుడి క్రాస్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో మంగళవారం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. క్రాస్ రోడ్డులో నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రైవేట్ బస్సు ఢీకొనగా అక్కడికక్కడే పడిపోయాడు. స్వల్పగాయలవ్వడంతో క్షతగాత్రుడుని అక్కడ ఉన్న వారు చికిత్సకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ELR: ఉంగుటూరు గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్తి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పరిశీలించారు. పంచాయతీ సచివాలయ సిబ్బందితోపాటు ఆయన కూడా ఇంటింటికి ఆస్తి పన్ను కులాయి పన్ను చెల్లించాలని కోరారు. ఉంగుటూరు గ్రామం పన్ను వసూళ్లలో ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ ఎంపీడీవో అన్నారు. కార్యదర్శి రవి పాల్గొన్నారు.
TG: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం శక్తిమంతమైన ప్రదేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
ASF: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా SP నితిక పంత్ మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్ లు తీసుకోని రావద్దన్నారు.
MBNR: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు అందాలంటే ఫార్మర్ ఐడీ అనేది తప్పనిసరి అని మహమ్మదాబాద్ మండలం నంచర్ల క్లస్టర్ ఏఈవో మౌనిక తెలియజేశారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఫార్మర్ ఐడీని పొందడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు వేదిక దగ్గరికి రావాలన్నారు.
WNP: పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు మంగళవారం కాశీ యాత్రకు బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వారికి పూల బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కాశి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని రావుల శుభాకాంక్షలు తెలిపారు.
కడప: జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో ACB రైళ్లు పరిగెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఐదుగురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పటివరకు ఏసీబీకి పట్టుబడిన వారిలో అందరూ ఉన్నతస్థాయి ఉద్యోగులే. కేవలం నెలరోజుల్లోనే ఐదుగురు పట్టుబడటంతో జిల్లాలో ఏ మేరకు అవినీ
E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పలువురు మృతి చెందడం, 19 మంది అస్వస్థతకు గురవ్వడం పట్ల మాజీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కల్తీకి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదన్నారు.
SDPT: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పంటలను దెబ్బతీసింది. ముఖ్యంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కొండాపూర్, అందె తదితర గ్రామాల్లో మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై అడ్డంగా చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను నేడు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. హాస్పిటల్ పనులు జూన్ 2వ తేదీకి పూర్తి కావడం ఆలస్యం అవుతోందని, ఎంజీఎం హాస్పిటల్‌లో గుండె చికిత్సలు, ఆక్సిజన్, మందుల కొరత, వైద్య సిబ్బంది సమస్యలు ఉన్నాయని, ప్రజలకు హాస్పిటల్ సేవలు సేవలు అందకపోవడం ప్రాణాల కోల్పోడానికి కారణమవుతున్నారు.
GNTR: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆమె పరిశీలించారు. కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిరాల వంటి కనీస వసతులను ఆరా తీశారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు.