TG: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం శక్తిమంతమైన ప్రదేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.