మంచిర్యాల ప్రభుత్వ ITI క్యాంపస్‌లో ఈనెల 23న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ మంగళవారం తెలిపారు. మెడ్‌ప్లస్ కంపెనీలో 160, స్మార్ట్ కిడ్ ఇండియా ఇన్నోవేషన్‌లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9392310323 సంప్రదించాలని సూచించారు.